ఎంపీ కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్దిగా వైసీపీ ప్రకటించింది. వైసీపీలో చేరిన నాని ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. వీటి పైన విజయవాడ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నుంచి తనను అవమానించి వెల్లగొట్టారని నాని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని స్పందించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నానికి లేదని పేర్కొన్నారు. నాని పైన పోటీ చేసే టీడీపీ అభ్యర్దిని మూడు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో పోటీ పడాలని సవాల్ చేసారు. వైసీపీ నుంచి సీటు తెచ్చుకున్న తరువాత నాని మాట్లాడాలని ఫైర్ అయ్యారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z