NRI-NRT

టంపాబేలో NATS-FIA రిపబ్లిక్ డే పరేడ్

టంపాబేలో NATS-FIA రిపబ్లిక్ డే పరేడ్

ఫ్లోరిడాలోని టంపాబేలో FIA విభాగం రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించింది. టంపాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రంలో (ICC) నాట్స్ & ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ టంపా బే చేపట్టిన ఈ రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతంగా జరిగింది. నాట్స్ సభ్యులు, తెలుగువారు చాలా మంది కలిసి రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు. చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పోటీలు నిర్వహించారు. నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఇందులో భాగస్వాముల అయి రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు. చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే నాట్స్ & Fఈఆ సభ్యులు సూచనలు ఇచ్చారు. నాట్స్ చేపట్టిన రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేయడానికి శ్రీనివాస్ బైరెడ్డి ,సుధాకర్ మున్నంగి, భరత్ ముద్దన, బిందు బండ, భాను ధూళిపాళ్ల తదితరులు కీలక పాత్ర పోషించారు. టెంపుల్ టెర్రేస్ నగరంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్- మాట, నాట్స్‌, మెలోడీ మాక్‌టైల్ సభ్యులు గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు.

ఈ పెరేడ్‌లో నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ 2025 సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, సభ్యులు కొత్తా శేఖరం, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ల,రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, టాంపాబే చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, విజయ్ కట్టా, శేఖర్ యెనమండ్ర, ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, మాధురి గుడ్ల, శైలేంద్ర గుడ్ల, మాలిని తంగిరాల, శ్యామ్ తంగిరాల తదితరులు పాల్గొన్నారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z