Politics

కత్తి శీను విడుదల

కత్తి శీను విడుదల

కోడికత్తి కేసులో అరెస్టయిన జనుపల్లి శ్రీనివాస్‌ ఎట్టకేలకు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. అనేక పిటిషన్లు, వాదనల అనంతరం హైకోర్టు ఆయనకు గురువారం షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను దళిత సంఘాల నాయకులు విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టులో సమర్పించారు. శ్రీనివాసరావు తండ్రి పేరిట, చిన్నాన్న పేరిట ఉన్న ఒక్కొటీ రూ.6.25లక్షల విలువైన వేర్వేరు భూమి పత్రాలతో పాటు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సాల్వెన్సీ పత్రాలు తీసుకురాగా సాయంత్రం 3.45గంటలకు బెయిల్‌ ఉత్తర్వులను జైలు అధికారులకు మెయిల్‌ చేశారు. దాని ఆధారంగా శ్రీనివా్‌సను విడుదల చేయడం కుదరదని, నేరుగా పత్రాలే తీసుకురావాలని విశాఖ జైలు అధికారులు సూచించారు. దీంతో దళిత సంఘాల నాయకులు మళ్లీ ఎన్‌ఐఏ కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి సంతకాలతో కూడిన బెయిల్‌ ఆదేశాలు తీసుకున్నారు. ఆ పత్రాలను కోర్టు సిబ్బందే జైలుకు తీసుకువచ్చి అందించిన తరువాత శ్రీనివా్‌సను విడుదల చేశారు. సాధారణంగా రిమాండ్‌ ఖైదీలు వారి దుస్తుల బ్యాగుతో బయటకు వస్తుంటారు. కానీ శ్రీనివాస్‌ మాత్రం అంబేడ్కర్‌ చిత్రపటాన్ని గుండెలపై పెట్టుకొని బయటకొచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది సలీం, విశాఖ దళిత సంఘాల(విదసం) ఐక్యవేదిక సభ్యులు, తదితరులు శ్రీనివా్‌సను ఆయన తండ్రి తాతారావుకు అప్పగించారు. శ్రీనివాస్‌పై ఇకపై ఎటువంటి కుట్రలు జరగకుండా అడ్డుకుంటామని దళిత సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేస్తామని న్యాయవాది సలీం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాను బయటకు వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగమే శ్రీనివా్‌సను కాపాడిందని న్యాయవాది సలీమ్‌ అన్నారు. తనకు గానీ, శ్రీనివాస్‌ కుటుంబానికి గానీ ఎటువంటి భద్రత అవసరం లేదన్నారు. తమలో ఎవరికి, ఏం జరిగినా సీఎం జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని సలీం పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z