నాట్లు దగ్గర నుంచి కలుపుతీత, ఎరువులు చల్లడం వరకూ వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంత కీలకమో మనకు తెలిసిందే! శ్రమ ఎక్కువగా ఉండే ఈ పనులని, సాంకేతికత వాడి సులభతరం చేస్తేనో.. అంతకంటే కావాల్సిందేముంది అంటారా. ఆ ఒక్క లాభమే కాదు… ఇతర ఉపాధి మార్గాలనూ చూపిస్తోంది ‘డ్రోన్ దీదీ’.
ఎవరీ డ్రోన్ దీదీ అనుకుంటున్నారా? ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఐఐటీ మండీ.. వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లని ఎలా వాడుకోవచ్చో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. మొదటి దఫాగా 20 మంది అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి మూడు నెలలపాటు … వ్యవసాయ డ్రోన్లలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, వాటిని ఉపయోగించి క్రిమిసంహారకాలని చల్లడం, తద్వారా ఉపాధి మార్గాలు పొందడం వంటివి నేర్పిస్తోంది. ‘డ్రోన్ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుంది. అధిక రసాయనాలను వాడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చల్లేటప్పుడు వాటి ప్రభావం పడి ఆరోగ్యం పాడయ్యే ప్రమాదమూ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కమతాలున్న రైతులకు డ్రోన్ సేవలు అందించడం ద్వారా దీనిని ఉపాధి మార్గంగానూ మలుచుకోవచ్చు’ అంటున్నారు ఐఐటీ మండీ నిర్వాహకులు. సీఏఐఆర్ (సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సంస్థ) ఆధ్వర్యంలో అమ్మాయిలు ఈ శిక్షణ అందిపుచ్చుకుంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z