NRI-NRT

దోహాలో తెలుగు ఇంజినీర్ల సమావేశం

దోహాలో తెలుగు ఇంజినీర్ల సమావేశం

భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్నా IBPC యొక్క Telugu Engineers Forum (TEF), దోహా ఖతార్‌లోని స్ట్రీట్ 10, ఇండస్ట్రియల్ ఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు తమ విజ్ఞానాన్ని పంచుకునే నిమిత్తం, ఒకరికొకరు సాయమందించుకునే నిమిత్తం తెలుగు సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

తోటి ఇంజనీర్‌లతో కనెక్ట్ అవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి మరియు వారి వృత్తిపరమైన నెట్‌వర్క్‌ని విస్తరించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని వక్తలు కొనియాడారు. TEF ప్రెసిడెంట్ నవాజ్ అలీ ఖాన్, ప్రధాన కార్యదర్శి G.K.దొర అతిథులు, వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, విశాల్, కృష్ణ, దీపా, రమ్య తదితరులు సంస్థ లక్ష్యాలను వివరించారు. హిషామ్ అబ్దుల్ రహీం, ప్రసాద్, సత్య, నందిని, వెంకప్ప భాగవతుల, సతీష్, దీపక్ చుక్కల, శంకర్ గౌడ్, సుధా రామోజు, మధు, చూడామణి, సిరాజ్ అన్సారీ, జాఫర్ హుస్సేన్,వెంకటేష్, కలీం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z