Editorials

238 సార్లు ఓడినా…మళ్లీ లోక్‌సభకు నామినేషన్!

238 సార్లు ఓడినా…మళ్లీ లోక్‌సభకు నామినేషన్!

ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన కే పద్మరాజన్‌ 1988లో మొదటిసారి మెట్టూరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రపంచంలోనే ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఇతని పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్టులో కూడా నమోదైంది. టైర్‌ పంచర్‌ షాప్‌ నడిపిస్తూ జీవనం సాగించే 65 ఏండ్ల కే పద్మరాజన్‌ ఈసారి తమిళనాడులోని ధర్మపురి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన ఘనుడు పద్మరాజన్‌.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z