ScienceAndTech

హిందూ మహాసముద్రంలొ “గ్రావిటీ హోల్” ఏర్పడటానికి కారణం అదే

హిందూ మహాసముద్రంలొ “గ్రావిటీ హోల్” ఏర్పడటానికి కారణం అదే

హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్‌ అంటారు. దీనివల్ల సముద్ర తలం 328 అడుగులకుపైగా కుంగిపోతుంది. భూమి అట్టడుగు నుంచి వచ్చే శిలాద్రవం (మాగ్మా) వల్ల ఇది ఏర్పడినట్లు పరిశోధకులు చెప్తున్నారు. అగ్ని పర్వతాలు ఏర్పడటానికి కారణమయ్యే శిలాద్రవం వంటిదే ఇది కూడానని అంటున్నారు. 14 కోట్ల సంవత్సరాల క్రితంనాటి పరిస్థితులను సూపర్‌ కంప్యూటర్ల ద్వారా మదింపు చేసి ఈ నిర్ధరణకు వచ్చామని చెప్తున్నారు. ఈ అధ్యయన వివరాలు ‘జియోఫిజికల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌’ జర్నల్‌లో ప్రచురించారు. భారత దేశ దక్షిణాగ్రం నుంచి ఈ గ్రావిటీ హోల్‌ ప్రారంభమైందని, 1.2 మిలియన్ల చదరపు మైళ్ల వరకు విస్తరించిందని, దీనిని మొదట డచ్‌ జియోఫిజిసిస్ట్‌ ఫెలిక్స్‌ అండ్రీస్‌ వెనింగ్‌ మెయినెస్జ్‌ 1948లో గుర్తించారని శాస్త్రవేత్తలు తెలిపారు.

హిందూ మహాసముద్రంలొ “గ్రావిటీ హోల్” ఏర్పడటానికి కారణం అదే👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z