Politics

నేటి నుండి బాలకృష్ణ యాత్ర

నేటి నుండి బాలకృష్ణ యాత్ర

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు. ఇందుకోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. ‘ఈ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ఏప్రిల్‌ 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z