NRI-NRT

టొరంటోలో వేడుకగా TCA ఉగాది

టొరంటోలో వేడుకగా TCA ఉగాది

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ (టొరంటోలో) వైభవంగా క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. గుప్తేశ్వరి వాసుపిల్లి, సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల, విజయ చిత్తలూరిలు జ్యోతి ప్రజ్వలన, గణేష ప్రార్థనతో సంబరాలను ప్రారంభించారు. నరసింహచారి పంచాంగ శ్రవణం చేశారు. వ్యాఖ్యాతలుగా శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకలలు వ్యవహరించారు. పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని ప్రతిభను చాటారు. ప్రవీణ్ నీలా దర్శకత్వంలో “కృష్ణం వందే జగద్గురుం” నాటిక, మనబడి బుర్రకథలు అలరించాయి. TCA తృతీయ ఉగాది సంచికను విడుదల చేశారు. రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం అతిథులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ, డైరెక్టర్లు – నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, ప్రవీణ్ కుమార్ శ్యామల, భగీరథ దాస్ అర్గుల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు – దేవేందరరెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, హరి రాహుల్ , కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z