NRI-NRT

ఆహ్లాదంగా ఆటా ఉగాది “తెలుగు వసంతం”

ఆహ్లాదంగా ఆటా ఉగాది “తెలుగు వసంతం”

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నాడు అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సమన్వయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర “తెలుగు వసంతం” సాహితీ సమావేశాన్ని నిర్వహించారు. త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రవచన చక్రవర్తి, శ్రీ శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వరశర్మ, సాహితీ కళా ప్రవీణ అవుసుల భానుప్రకాష్ అవధాని, సినారె వాగ్భూషణ పురస్కార గ్రహీత నంది శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గణనాథుని కీర్తనతో కార్యక్రమం ప్రారంభమయింది. వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన, సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు, పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగింది. ఆటా సాహితీ సభ్యులకు, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ధన్యవాదాలు తెలిపారు. 2024 అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీలలో జరుగనున్న18వ ఆటా సభలకు ఆహ్వానించారు. ఆటా సాహిత్య వేదిక సభ్యురాలు మాధవి దాస్యం ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z