Kids

8వతరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల అఘాయిత్యం-CrimeNews-May 06 2024

8వతరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల అఘాయిత్యం-CrimeNews-May 06 2024

* ఎన్నికల వేళ దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపుతున్నాయి. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సుమారు 200 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని పలు పాఠశాలలకు (schools) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. నగరంలోని మూడు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల వద్దకు చేరుకొని డాగ్‌స్వ్కాడ్‌, బాంబ్‌ స్వ్కాడ్‌ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

* ఒక బాలుడ్ని తోటి విద్యార్థులు దారుణంగా వేధించారు. దుస్తులు విప్పించి అతడ్ని కొట్టడంతోపాటు మలద్వారంలో కర్రను చొప్పించారు. దీంతో ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. (Boy Assaulted By Classmates) మార్చి 18న ఒక స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడి పట్ల క్లాస్‌మేట్స్‌ దారుణంగా ప్రవర్తించారు. క్లాస్‌ రూమ్‌ నుంచి అతడ్ని బయటకు తీసుకెళ్లారు. దుస్తులు విప్పించి కర్రతో కొట్టారు. ఆపై కర్రను అతడి మలద్వారంలోకి చొప్పించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు. కాగా, ఈ సంఘటన వల్ల ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. తీవ్ర కడుపు నొప్పితో బాధపడటంతో అతడి పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు బాలుడి పేగులు దెబ్బతిన్నాయని, సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఏం జరిగిందని తల్లి అడగ్గా జరిగిన దారుణం గురించి అతడు చెప్పాడు. సర్జరీ చేయడంతో నెల రోజులు ఆసుపత్రిలో ఉన్న ఆ బాలుడు ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు తన కుమారుడికి జరిగిన వేధింపుల పట్ల అతడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్‌ చేసింది. అలాగే స్కూల్‌ యాజమాన్యం, అధికారులు కూడా తగిన చర్యలు చేపట్టాలని కోరింది. భయానక సంఘటన వల్ల తన కుమారుడు నిద్రలో లేచి ఉలిక్కి పడుతున్నాడని వాపోయింది. అలాగే మూడు నెలల తర్వాత మరో సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె పేర్కొంది.

* కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నరేశ్‌ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్‌ అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతులను వెంకటాపుర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు ధ్వంసమైంది. ఎయిర్‌ బెలూన్‌లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

* ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్‌బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్‌ స్టడీ వీసాపై ఎంటెక్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్‌, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువు​కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్‌ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్‌ కూడా గాయపడ్డాడు.

* కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీపీ శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్‌ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేశాం. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ట్విట్టర్‌కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్‌ నుంచి వీడియో అప్‌లోడ్‌ అయ్యిందో ట్విట్టర్‌ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్‌ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు. మార్ఫింగ్‌ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించాము. ఫోరెన్సిక్‌ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్‌ క్రియేట్‌ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z