బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం నాడు నిర్వహించిన ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్పీ చరణ్, సునీతల ప్రత్యేక పాటల విభావరి అలరించింది. ఉగాది పండుగ సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
GWTCS అధ్యక్షుడు లాం కృష్ణ మాట్లాడుతూ..లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న అమెరికాలో ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ తెలుగును సజీవంగా నిలబెడుతున్న సంఘాల్లో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుందన్నారు. GWTCS సంస్థకు స్వర్ణోత్సవ సంవత్సరం(1974 – 2024) అని త్వరలో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
కార్యవర్గ సభ్యులు అతిధులు, గాయనీగాయకులను ఘనంగా సత్కరించారు. చంద్ర మాలావతు, సుశాంత్ మన్నే, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, సుష్మ అమృతలూరి, పద్మజ బేవరా, గంగ శ్రీనివాస్, విజయ్, ప్రవీణ్ రాజేష్, ఉమాకాంత్, శ్రీ విద్య సోమ, పూర్వ అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, సాయి సుధా పాలడుగు, తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింత, సత్య సూరపనేని, తానా మాజీ తదుపరి అధ్యక్షులు వేమన సతీష్, డా. నరేన్ కొడాలి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z