* సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ(Modi) విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఒడిశా(Odisha)లో పర్యటించిన ఆయన.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయాన్ని(Puri temple) దర్శించుకున్నారు. అనంతరం బీజేడీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ పాలనలో దేవాలయానికి కూడా రక్షణలేకుండా పోయిందన్నారు. ‘‘ఈ ప్రభుత్వ హయాంలో జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదు. గత ఆరేళ్ల నుంచి రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదు’’ అని మోదీ విమర్శించారు. కొద్దిరోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదే విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘కొన్నాళ్లుగా కోట్లాదిమంది పూరీ జగన్నాథ్ స్వామి భక్తులు రత్నభాండాగారం గురించే ఆలోచిస్తున్నారు. ఈ భాండాగారం తాళం చెవుల మిస్టరీని బయటపెట్టాలని కోరుకొంటున్నారు. నవీన్ పట్నాయక్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. నకిలీ తాళాలు ఎవరు తయారుచేశారు?’’ అని ప్రశ్నించారు.
* రేషన్ కోసం క్యూలో నిలబడే సగటు మహిళలతో పోలిస్తే, వేశ్యలు, సెక్స్ వర్కర్ల పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం తనకు ఎంతో ఆసక్తిగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వెబ్‌సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ (Heeramandi). నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ విజువల్ వండర్‌గా నిలిచింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
* బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ (Hema) స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆమె ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై వస్తోన్న వార్తలను నమ్మకండి. అవి ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’ అని విజ్ఞప్తి చేశారు.
* బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు.
* తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
* బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వార్, బెంజ్ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
* ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారు.
* తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ధాన్యం కొనుగోళ్లు, విద్యాసంస్థల్లో వసతులు, మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
* దిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.
* చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
* మహారాష్ట్రలోని పుణెలో ఓ బాలుడి నిర్లక్ష్యం ఇద్దరి యువకుల జీవితాలను బలితీసుకుంది. ఈ కేసులో ఆ మైనర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఆ సమయంలో విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది.
* లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ‘హ్యారీ విన్‌స్టన్’ (Harry Winston)లో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో కంపెనీ లోపలికి ప్రవేశించిన కొందరు దుండగులు రూ. కోట్ల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ దర్యాప్తు కార్యాలయం వెల్లడించింది.
* ఐపీఎల్ 17వ సీజన్‌లో 10 జట్లు హోరాహోరీగా తలపడగా.. మంచి ప్రదర్శన కనబరిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఢీకొంటుంది. బుధవారం ఇదే వేదికలో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు అమీతుమీ తేల్చుకుంటాయి. శుక్రవారం క్వాలిఫయర్-2 (ఎలిమినేటర్ విజేత × క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు) జరుగుతుంది. ఆదివారం చెన్నైలో ఫైనల్ ఆడతారు.
* పదవులు, హోదా ఇలా గుర్తింపు సాధించేందుకు ఈ భూమ్మీదకు రాలేదని, ప్రజలకు తనవంతు సేవ చేసేందుకే తన జీవితం అంకితమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). తాను కేవలం కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ‘బ్రాండ్ మోదీ (Brand Modi)’ అంటూ తనపై వస్తున్న ప్రశంసలకు ఆసక్తికరంగా స్పందించారు. ప్రజా విశ్వాసమే తనకు ఆ పేరు పెట్టిందన్నారు.
* ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపు తప్పడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. స్థానికులు కొందరు అడవి నుంచి తెండు ఆకుల్ని సేకరించి పికప్ వాహనంలో తిరిగివస్తుండగా అదుపుతప్పి లోయలో పడింది. అప్పుడు అందులో 25 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలేనని వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z