Sports

రిటైర్మెంట్‌పై నాదల్ వ్యాఖ్యలు

రిటైర్మెంట్‌పై నాదల్ వ్యాఖ్యలు

మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ర‌ఫెల్ నాద‌ల్(Rafael Nadal) త‌న రిటైర్మెంట్ వార్త‌ల‌పై స్పందించాడు. ప్ర‌తిష్ఠాత్మ‌క ఫ్రెంచ్ ఓపెన్(French Open 2024) టోర్నీకి సిద్ద‌మైతున్న నాద‌ల్ ఇదే త‌న ఆఖ‌రి టోర్నీ కాద‌ని చెప్పాడు. ‘రిటైర్మెంట్ ప‌లుకుతాన‌ని వంద శాతం క‌చ్చితంగా చెప్ప‌లేను. ఎందుకంటే.. నేను టెన్నిస్ ఆడ‌డాన్నిఇంకా ఆస్వాదిస్తున్నా. ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా స‌రే ఏ హ‌ద్దులు లేకుండా టెన్నిస్ ఆడుతా. మ‌రొక నెల లేదా నెల‌న్న‌ర రోజుల‌కు నేను ఆట‌కు వీడ్కోలు ప‌ల‌కొచ్చు’ అని నాద‌ల్ తెలిపాడు.

సుదీర్ఘ కెరీర్‌లో నాద‌ల్ ఎన్నో మైలురాళ్లను అధిగ‌మించాడు. రోజ‌ర్ ఫెద‌ర‌ర్, నొవాక్ జ‌కోవిచ్ వంటి దిగ్గ‌జాల‌ను ఓడించి 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌తో చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌స్తుతం ర‌ఫా కెరీర్‌లో చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాడు. నిరుడు తొడ‌కండ‌రాల గాయం కార‌ణంగా ప‌లు టోర్నీల‌కు దూర‌మైన ఈ స్పెయిన్ బుల్ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌తో ఎంట్రీ ఇచ్చాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z