తెల్లవారు జామున లేవాలని పెద్దలు నుంచి వింటూనే ఉంటాము. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదం కూడా నమ్ముతుంది. ఉదయాన్నే నిద్ర లేవడం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండ మీ జీవితాన్ని క్రమబద్దంగా ఉంచుతుంది. మనలో చాలా మంది రాత్రి ఆలస్యంగా నిద్ర పోతున్నారు. దీంతో ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు పెరుగుతుంది. అయితే ఉదయాన్నే నిద్రలేవడం వలన మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
* పొద్దున్నే నిద్ర లేచే వారు ఆ రోజంతా.. తాజా అనుభూతి చెందుతారు. సూర్యోదయానికి ఒక గంట 36 నిముషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో నిద్ర లేవడం చాలా మంచిది.
* ఉదయాన్నే లేచే వారు చురుగ్గా పని చేయగలుగుతారు. ఈ అలవాటు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచాడనికి, సమయాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది.
* ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి తొందరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల మీ జీవనగడియారం సక్రమంగా పని చేస్తుంది. అంతే కాకుండ ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు.
* జ్ఞాపక శక్తి పెరిగి, మీ మెదడు పని తీరును మెరుగ్గా ఉంచుతుంది.