ఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరం

🕑 Published: April 03, 2026 at 11:13 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది వేడుకలను పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్లో వైభవంగా నిర్వహించారు. ప్రార్థనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సంప్రదాయమైన ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఇండియన్ ఐడల్ స్టార్ అనిరుధ్ సుస్వరం సంగీత విభావరి ఆకట్టుకుంది. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కె.పి. సోంపల్లి పౌరాణిక ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది.


స్పాన్సర్లు డాక్టర్.నాయుడు,డాక్టర్ ప్రమీల మోటుపల్లి, తిరుమల్ మునుకుంట్ల, సుబ్రహ్మణ్యం ఒసూరు, రామకృష్ణ తాడిసెట్టి, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొన్న తానా మిడ్ అట్లాంటిక్ గర్ల్స్ క్లబ్ కు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. వ్యాఖ్యాతగా శ్వేత కొమ్మోజి రక్తి కట్టించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ఉగాది వేడుక కార్యక్రమాన్ని నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్‌ను అభినందించారు. తానా కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ నరెపాలేపు, న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలను అందజేశారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, సతీష్ తుమ్మలలు సంబరాలను సమన్వయపరిచారు. అరవింద్ నాగిళ్ల ఫోటోగ్రఫీ సహకారం అందించారు.

📲 Join Our WhatsApp Channel
ఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానం
Previous Article Next Article