మలేషియాలో ఉగాది గీతాంజలి

🕑 Published: April 05, 2026 at 11:36 AM CST

మలేషియాలోని బ్రిక్‌ఫీల్డ్స్‌లో ఘనంగా నిర్వహించిన ఉగాది గీతాంజలి కార్యక్రమం సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) మరియు మన సంస్కృతి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుక, భారతీయ శాస్త్రీయ కళల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ, మలేషియా–భారత దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది.

ఈ కార్యక్రమానికి మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు డాటో కాంతా రావు గారు, భారతదేశంలోని మన సంస్కృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు ప్యారిస్‌లోని ఇండియన్ డాన్స్ కౌన్సిల్ CID సభ్యురాలు శాంతి శ్రీ కొమ్మమూరి గారు ప్రధాన భూమిక పోషించారు. మలేషియా–భారత సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల భాగంగా నిర్వహించిన ఈ వేడుక, రెండు దేశాల మధ్య కళాత్మక సహకారాన్ని ప్రోత్సహించే దిశగా సాగింది.

ఈ వేడుకలో భారతదేశం నుండి వచ్చిన చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాలుగేళ్ల వయసు నుంచి ఉన్న ఈ చిన్నారులు రంగస్థలంపై అడుగుపెట్టిన ఈ బాల నృత్య కళాకారులు, తమ అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వారి క్రమశిక్షణ, అభినయం, నృత్య నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది.

వీరి అసాధారణ ప్రతిభను గుర్తించి, చిన్నారి కళాకారులందరికీ సర్టిఫికెట్లు మరియు స్మారక చిహ్నాలు అందజేయబడ్డాయి. ఈ సత్కార కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా అధ్యక్షులు బురెడ్డి మోహన్ రెడ్డి, మలేషియా తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ కోశాధికారి నాగరాజ సూర్యదేవర మరియు సమాజ నాయకులు డాటో సూర్య ప్రకాష్ నిర్వహించారు

తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం కేవలం పండుగ సంబరాలకే పరిమితం కాకుండా, మలేషియా మరియు భారతీయ సమాజాల మధ్య సాంస్కృతిక మార్పిడి, ఐక్యత, మరియు సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించే వేదికగా నిలిచింది. ఈ విధమైన కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ సాంస్కృతిక భాగస్వామ్యాలకు దారి తీస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

📲 Join Our WhatsApp Channel
మెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీ
Previous Article Next Article