🕑 Published: June 04, 2026 at 07:48 AM CST
పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న 'ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ 10వేల డాలర్ల విరాళాన్ని అందించింది. నాట్స్ బృందం ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్యామ్ మద్దాళికి అందించారు.
శ్రీహరి మందాడి, శేఖరం కొత్త, శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీధర్ అప్పసాని, ప్రశాంత్ పిన్నమనేని, గంగాధర్ దేసు, బాపు నూతి, రాజ్ అల్లాడ, హరి బుంగటావుల, టిపి రావు, బిందు యలమంచిలి, శ్యామ్ నాళం, శ్రీనివాస్ భీమినేని, కిరణ్ మందడి, వంశీ కొప్పురావూరి, ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వి.కె.రాజు, ప్రెసిడెంట్ లీలీ వి.రాజు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శేఖర్ వెంపరాల, శ్రీను మద్దులలు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ వి.కె. రాజు నేతృత్వంలోని గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ 50 ఏళ్ల మైలురాయి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ₹180కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త అంతర్జాతీయ స్థాయి భవనాన్ని నిర్మిస్తోంది. ఈ క్యాంపస్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వచ్చే పేద రోగులకు పూర్తి ఉచితంగా కంటి ఆపరేషన్లు, చికిత్సలు అందించనున్నారు.
