మిషిగన్‌లో రుక్మిణి కల్యాణం

🕑 Published: August 04, 2026 at 12:59 AM CST

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మిషిగల్లోని సాగిన నగరంలో ట్రైసిటీ హిందూ టెంపుల్ ఆధ్వర్యంలో కళా రత్న కెవి సత్యనారాయణ రచన నృత్య దర్శకత్వం వహించిన రుక్మిణి కళ్యాణం కూచిపూడి నృత్య రూపకం ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడినది. 30 మంది స్థానిక నృత్య కళాకారులు తో ఈ నృత్య రూపకం ప్రదర్శించబడినది. ప్రదర్శనకు విచ్చేసిన తెలుగు వారే కాక ఇతర భాషలవారు ప్రదర్శన తిలకించి అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమ నిర్వహణ సమన్వయకర్తగా శ్రీమతి కోనేరు సునీత వ్యవహరించారు. తదనంతరం ఆలయ చైర్మన్ బెంగళూరు ప్రభాకర్ మరియు డాక్టర్ కరు మరియు లక్ష్మీకరు, డాక్టర్ కిషోర్ డాక్టర్ రాజ్యం దంపతులు కేవీ సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. ఈ ప్రదర్శనను డాక్టర్ చక్రవర్తి, శ్రీమతి ప్రమీల, డాక్టర్ కిషోర్ ,డాక్టర్ రాజ్యం దంపతులు, డాక్టర్ రాధా, డాక్టర్ రమ ఇంకా ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడమైనది. రుక్మిణి ఐషాని కోనేరు, కృష్ణునిగా సుహాన , నారదుడుగా కృష్ణ, విష్ణుమూర్తి గా సుజా, లక్ష్మీ గా భువన, ఇంద్రుడు బలరామునిగా వైనవి, ఇంకా ఇతర పాత్రల్లో రాగా, జైత్రి , ఐషానా, షర్మిత మొదలగు వారు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు విచ్చేసిన ప్రేక్షకులు వచ్చే సంవత్సరం మరియొక నూతన నృత్యరూపకాన్ని ప్రదర్శించవలెనని సాగినాలోని పిల్లలకు కూచిపూడి శిక్షణ ఇవ్వవలసిందిగా కేవీ సత్యనారాయణ కోరడమైనది. ఈ ప్రదర్శనకు శ్రీ శ్రీధర్ మరియు శ్రీ కృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

📲 Join Our WhatsApp Channel
2029లో టీడీపీ విజయమే లక్ష్యం-జర్మనీ ఎన్నారై తెదేపాఎస్.జానకికి డల్లాస్ అభిమానుల సంగీత నివాళిన్యూజెర్సీలో పర్యటించిన తెభాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుసిలికానాంధ్ర సిగలో మరో మూడు గిన్నీస్ రికార్డులుహైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్-ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లివైవిధ్యంగా సిలికానాంధ్ర దాతల అభినందన సభతానా-పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంఅట్టహాసంగా ఆరంభమైన "ఆటా"19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీన్యూయార్క్‌లో వైభవంగా NYTTA బోనాల జాతరనాట్స్ డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గం ఇదేలండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతరATA Conducts Fun Filled Golf Tournament in Virginiaఇతర భాషల్లోకి సుశ్రుత సంహితను అనువదించాలిడెట్రాయిట్ ప్రవాసులను అలరించిన విష్ణు కళ్యాణం నృత్యరూపకంమలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుడల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణబెల్జియంలో 54వ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ప్రారంభంబాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటిHTSL: వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం
Previous Article Next Article