ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరా

🕑 Published: October 22, 2026 at 11:37 AM CST

ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ నగరం లో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆద్వర్యం లో నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా వేడుకలు అత్యంత వైభవంగా , కన్నుల పండుగగా జరిగాయి. R.A Brown Middle School లో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శనివారం రోజు జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు మరియు చిన్నారి అమ్మాయిలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటల తో సందడి చేసారు. మొదటి సారి పురుషులు, మహిళలు మరియు పిల్లలు కోలాటం ఆట లో ఎంతో హుషారుగా పాల్గొన్న వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు అందరు గౌరమ్మ మరియు ప్రసాదం ని ఇచ్చి పుచ్చుకున్నారు. దసరా ఉత్సవాన్ని షమీ స్తోత్రం అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ భలాయ్ చేసికున్నారు. బతుకమ్మ మరియు రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ రుచికరమైన భోజనం ని వడ్డించారు.

ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల OTA టీం తరుపున బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పండుగలని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికి శ్రీని ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలని అత్యంత అంగ రంగ వైభవవోపేతంగా జరిపి విజయవంతం అవటానికి కృషి చేసిన OTA టీం మరియు వాలంటీర్స్ - సురేష్, శ్రీపాద్, మతి భాస్కర్, సుధ, రఘు.S ,శ్రీని.G , అరుణ్, ప్రదీప్, అజయ్, శ్రీకాంత్, జానకి, రోహన్, నవీన్, రఘు.బి, స్వాతి ,జయ్, జానకి, అభిరామ్ మరియు వాహిని, మతిమరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ప్రశంసలు తెలియ చేసారు. చివరగా వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకి, శ్రేయలోభిలాషులకి OTA టీమ్ తరుపున అభింకందనలు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
బోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ
❮ No Previous Next Article ❯