🕑 Published: November 01, 2026 at 07:15 PM CST
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్త దాతలకు కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకటరమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజారమణి, రవికృష్ణ విజ్జాపూర్, పెరుకు శివరామ్ ప్రసాద్, విజయమోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా కృష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్రప్రసాద్, యసరావేణి విజయకుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం తదితరులు పాల్గొన్నారు.


