ఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువ

🕑 Published: October 27, 2026 at 06:01 PM CST

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన ఫ్రిస్కోకు చెందిన ప్రవాసాంధ్రుడు సతీష్ మండువ అభినందన సభ ఆదివారం నాడు డల్లాస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక నాయకులు హాజరై అమెరికా–ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించేందుకు తమ మద్దతు తెలిపారు.

అమెరికా కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలతో అనుసంధానించడం తన ప్రధాన బాధ్యత అని సతీష్ మండువ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నంలో గూగుల్ ప్రతిపాదించిన ఏఐ, డేటా సెంటర్ ప్రాజెక్టు, అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను పెంచుతున్నాయని వివరించారు. టెక్నాలజీ, ఇంధనం, తయారీ, వైద్యం, విద్యా రంగాల్లో అమెరికా సంస్థలతో భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించిన పలువురు ఇన్వెస్టర్లు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తనకు సహకరించనున్న సలహాదారుల బృందం పాటిబండ్ల అనీల్, నక్కా కిషోర్, కృష్ణకుమార్, గోనుగుంట్ల నీలిమ, నన్నపనేని సతీష్‌లను మండువ పరిచయం చేశారు. ఇంటెలిసాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓగా, ఐటీసర్వ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 2000కు పైగా ఐటీ కంపెనీలకు సేవలందించిన సతీష్ అమెరికా–ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడులు, పరిశోధన, విద్యా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. అశోక్ మాగో జీ, నీతి ఖైతాన్, డా. రాజు కోసూరి, గనపురం మహేందర్, మైని సునీల్, డా. ఉషా పేరి, జూపూడి సంజయ్, కృష్ణ కొరాడ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
చైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శనకొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణబోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మ
❮ Previous Article Next Article ❯