London..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నిక

🕑 Published: November 10, 2026 at 11:01 AM CST

లండన్‌లోని బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. స్థానికంగా తెలుగు వ్యక్తి ఈ ఘనత సాధించడంతో తెలుగు సమాజం హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపింది. ఎన్నికైన వెంటనే స్థానిక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధుల సేకరణ కోసం చంద్ర 38 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఈ యాత్ర ద్వారా విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేశారు.

చంద్ర చేపట్టిన పాదయాత్రకు స్థానిక పార్లమెంట్ సభ్యుడు, సటన్ మేయర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా తెలుగు సంఘం నాయకుడు భాస్కరరావు అమ్మినేని మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు, స్థానిక విద్యావ్యవస్థ అభివృద్ధి పట్ల చంద్రకు ఉన్న నిబద్ధతకు ఈ పాదయాత్ర నిదర్శనమని పేర్కొన్నారు. సమాజ సేవ, విద్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

📲 Join Our WhatsApp Channel
USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవంలండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరాషాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరావర్జీనియాలో AAVGF అవగాహన సదస్సుఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువచైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శనకొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి
❮ No Previous Next Article ❯