వేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

🕑 Published: May 01, 2026 at 12:39 PM CST

* 92% రెసిడెన్సీ మ్యాచ్ రేటు
* Prime Healthcareతో భాగస్వామ్యం
* AI ఆధారిత పాఠ్య ప్రణాళిక

ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ(SMU) 2026 గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం మూడు ముఖ్యమైన మైలురాళ్లను ప్రకటించింది. 92% రెసిడెన్సీ మ్యాచ్ రేటు సాధించినట్లు ప్రకటించారు. Prime Healthcare Services‌తో కొత్త భాగస్వామ్యం, వైద్య విద్యలో కృత్రిమ మేధస్సు(AI) వినియోగించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటనలు వెలువరించారు.

బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ డా. హరనాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ SMU మరియు Prime Healthcare Services మధ్య భాగస్వామ్యం ద్వారా అమెరికా ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రైనింగ్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వైద్య రంగ భవిష్యత్తును AI ముందుకు నడిపిస్తోందని విద్యార్థులు తదుపరి తరానికి సిద్ధంగా ఉండేందుకు SMU పాఠ్య ప్రణాళికలో AIని చేర్చుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అధ్యక్షుడు డా. మురళి గింజుపల్లి మాట్లాడుతూ 2026లో SMU 92% రెసిడెన్సీ మ్యాచ్ రేటు సాధించడం గొప్ప విజయమని చెప్పారు. డా. శ్రీరామ్ పూరేటి ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. డా. సంజీవ్ కౌల్, చాన్సలర్ డా. సురేయ్యా సవాసన్, వైస్ చాన్సలర్ డా. డన్నా సోరియా, డీన్ ఆఫ్ క్లినికల్ సైన్సెస్ డా. బ్రాండన్ క్రౌట్ తమ సందేశాలను అందించారు. డా. రాఘవేంద్ర చౌదరి వేములపల్లి విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ తాళ్లూరి జయశేఖర్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. బోర్డ్ సభ్యులు నిరంజన్ శృంగవరపు, సురేష్ పుట్టగుంట, కృష్ణ కుర్రా, ప్రకాశ్ గేరా, నవీన్ ఆలే, రాధిక కత్తరగడ్డ, ప్రముఖ కన్సల్టెంట్ డా. కమేంద్ర దేవిదాస్ దహత్, అలుమ్ని డా. గోపీ ములకా, డా. మోహిత్ శర్మ, డా. నౌషాద్ మన్సూరి, ప్రసాద్ బెతంచెర్ల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, డా. సమ్హిత్ చంద్ర గింజుపల్లి, డా. పొలిచెర్ల విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

St. Martinus University (SMU) celebrated its 2026 graduation ceremony with major institutional milestones, including a 92% residency match rate, a newly announced collaboration with Prime Healthcare Services, and the integration of artificial intelligence (AI) into its medical curriculum. The ceremony, attended by approximately 210 guests, was held from 12:00 PM to 3:00 PM and marked a significant moment in the university’s 25-year history of medical education.

Strategic Announcements Position SMU for the Future of Healthcare During the ceremony, Chairman of the Board of Governors Dr. Haranath Policherla announced a collaborative initiative between SMU and Prime Healthcare Services aimed at strengthening clinical training opportunities within U.S. hospital systems. “The future of healthcare is being driven by artificial intelligence,” said Dr. Policherla. “St. Martinus University is proactively integrating AI into its curriculum to ensure our graduates are prepared for the next generation of medicine.”

University President Dr. Murali Ginjupalli announced that SMU achieved a 92% residency match rate for 2026, reinforcing the institution’s ability to prepare students for successful placement in competitive training programs. Among the graduating class was Samhith Chand Ginjupalli, reflecting both institutional and personal milestones during the ceremony.

The event began with the Pledge of Allegiance, led by current clinical rotation students, including Dr. Vijay Krishna Policherla. The formal program included: Welcome and processional led by Dr. Sriram Pureti Introduction of Chief Guest Dr. Sanjeev Kaul Leadership remarks from: Dr. Sureyya Savasan (Chancellor) Dr. Danna Soria (Vice-Chancellor) Dr. Brandon Krout (Dean of Clinical Sciences) Diplomas were conferred beginning at 1:15 PM, followed by the administration of the Hippocratic Oath by Dr. Raghavendra Chowdary Vemulapalli.

Chairman of the Board of Directors Jay Talluri extended congratulations to the graduating class. Board members in attendance included Niranjan Srungavarapu, Suresh Puttagunta, Krishna Kurra, Prakash Gera, Naveen Ale, and Radhika Kattragadda. The ceremony was also attended by prominent consultant Dr. Kamendra Devidas Dahat, alumni including Dr. Gopi Mulaka, Dr. Mohit Sharma, and Dr. Naushad Mansoori, and community leaders Prasad Bethamcherla and Jogeshwara Rao Peddiboyina.

Chief Executive Officer Shrini Sajja delivered the closing remarks, thanking faculty, students, and guests, and emphasizing the university’s continued focus on operational growth and global expansion.

📲 Join Our WhatsApp Channel
టెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతితానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడండిసింగపూర్ ప్రవాసులతో మంత్రి సత్యకుమార్ భేటీCAA ఆధ్వర్యంలో చికాగోలో వైభవంగా సీతారామ కళ్యాణంఆటా 19వ మహాసభల నిధుల సేకరణకు డాలస్‌లో విశేష స్పందనATA 19th Convention Fundriser In New Jersey Rises 625K USDఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాంన్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in WashingtonATA Convention Meet and Greet Kickoff In Harrisburg PA25న నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాది
No Previous Next Article