వైభవంగా న్యూజెర్సీ మోన్రో టౌన్‌షిప్ సాయిబాలాజీ ఆలయ భూమిపూజ

🕑 Published: July 13, 2026 at 02:36 PM CST

న్యూజెర్సీ రాష్ట్రంలోని మోన్రో టౌన్‌షిప్‌లో నిర్మాణంలో ఉన్న ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయ భూమిపూజ కార్యక్రమం జూన్ 24 నుండి 28 వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఐదు రోజుల మహోత్సవంలో చండీయాగ సహిత కోటి కుంకుమార్చన మహాయజ్ఞం నిర్వహించారు. కోటి కుంకుమార్చనలు విజయవంతంగా పూర్తయ్యాయి. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఈ స్థాయిలో నిర్వహించిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

భారతదేశంలోని తిరుమల, కాశీ, రామేశ్వరం, పెనుగొండ, వడపల్లి, పుట్టపర్తి వంటి పవిత్ర క్షేత్రాల నుండి తీసుకొచ్చిన మట్టి(మృత్తిక), సప్తనదీ జలాలు, స్వర్ణ శ్రీచక్రం ఈ మహా కార్యక్రమంలో వినియోగించారు. భూమిపూజ సందర్భంగా భక్తులు సమర్పించిన పవిత్ర ఇటుకలను భవిష్యత్తులో నిర్మించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి గర్భగుడి సమీపంలో తిరుమల ఏడుకొండలను సూచించే విధంగా ఏడు పొరలుగా ప్రతిష్ఠించారు. ఆలయ ఛైర్మన్ సూర్యనారాయణ మద్దుల, ఫౌండర్స్, ట్రస్టీలు, వేద పండితులు, వందలాది మంది సేవకులు, దాతలు పాల్గొన్నారు.

https://youtube.com/shorts/yEPFcsMfTmU

📲 Join Our WhatsApp Channel
అమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగంమనస్సున్న మా"రాజు" వై.ఎస్ - డల్లాస్‌లో ఘనంగా జయంతి వేడుకశంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్ఎన్నారై తెదేపా జాతీయ అధ్యక్షుడిగా పిల్ రాజా25న ఫ్రిస్కోలో కీరవాణి సంగీత విభావరిఎర్రబెల్లికి ఆటా సన్మానంYSR Jayanthi Celebrations in Dallas On July 11thశనివారం నుండి విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలుఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలుఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటున్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Convention
Previous Article Next Article