🕑 Published: November 16, 2026 at 03:41 PM CST
కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ రవి పొట్లూరి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సి.శ్రావణి విద్యాభ్యాసం కోసం రూ. 50000/- ఆర్థిక సహాయాన్ని అందించారు. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని శ్రావణికి అందజేశారు. సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో మరింత రాణించాలని విద్యార్థినికి సూచించారు.
