Movies

చెంప చెళ్లుమనిపిస్తాను

చెంప చెళ్లుమనిపిస్తాను

అలనాటి బాలీవుడ్‌ నటులు వహీదా రెహమాన్, ఆశా పరేఖ్‌, హెలెన్‌లు ‘ది కపిల్‌ శర్మ షో’ అనే కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వహీదా ఓ షాకింగ్‌ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘రేష్మా ఔర్‌ షేరా’ అనే సినిమాను చిత్రీకరిస్తున్న సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా వహీదా.. హీరోగా నటిస్తున్న అమితాబ్‌ చెంపచెళ్లుమనిపించారట. ‘సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ సన్నివేశంలో అమితాబ్‌ చెంపపై కొట్టే సీన్‌ ఒకటి ఉంది. అప్పుడు నేను అమితాబ్‌తో ‘మీ చెంప చెళ్లుమనిపిస్తాను’ అన్నాను. ఇందుకు అమితాబ్‌.. ‘అలాగే ఫర్వాలేదు’ అన్నారు. అలా ఆయనపై కాస్త గట్టిగానే చేయిచేసుకున్నాను’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు వహీదా. 1971లో విడుదలైన ‘రేష్మా ఔర్‌ షేరా’ సినిమాకు సునీల్‌ దత్‌ దర్శకత్వం వహించారు. వినోద్‌ ఖన్నా, రాఖీ సహాయ పాత్రల్లో నటించారు.