Politics

బడలికతో పడిపోయిన బోడే

బడలికతో పడిపోయిన బోడే

కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైన ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎండల్లో ప్రచారం చేయడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.