Business

ఇండియా సామర్థ్యం అసామాన్యం

ఇండియా సామర్థ్యం అసామాన్యం

‘భారత్‌కు చాలా సామర్థ్యం ఉంది.. కానీ వేగవంతమైన వృద్ధిరేటే అవసరం..ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులను తొలగించడానికి సిద్ధంగా ఉంది అనేది ముఖ్యం’ అని అని పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి అభిప్రాయపడ్డారు. మార్చి28 వ తేదీన కాన్సల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తి ఏర్పాటు చేసిన యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం సదస్సులో ఆమె మాట్లాడారు.‘‘భారత్‌కు ప్రతిభ పరంగా, జనాభా పరంగా ప్రతి అంశంలోనూ మంచి సామర్థ్యం ఉంది. ఏం చేస్తే దేశానికి మంచిదో భారత్‌ తెలుసుకుంది. ఆ విషయం చెప్పడానికి నేను తగిన వ్యక్తిని కాదు. యూరప్‌ ఏది మంచిదైతే అదే చేస్తుంది. అదే విధంగా భారత్‌ కూడా తెలుసుకుంది. మీరు ఏదైనా దేశానికి వెళితే అక్కడి ప్రజల వలే ఉండాలి. అంతేకానీ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే కుదరదు. నైతికత, నిర్వహణ విషయం తప్పితే ప్రతీది స్థానికంగా ఉండాలి. మీరు స్థానికంగానే అభివృద్ధి చేయాలి.. అక్కడే పనిచేయాలి.. కానీ మీ కార్పొరేట్‌ నిర్వహణ సిద్ధాంతాలను వదులుకోవద్దు. మీరు అక్కడి రాజకీయాలు తెలుసుకోవాలి. కానీ వాటిల్లో భాగస్వాములు కాకూడదు.. అలా చేయకపోతే సమతుల్యం కోల్పోతారు.’’ అని పేర్కొన్నారు.