Sports

ఉప్పల్‌లో వెంకటేష్ సందడి

ఉప్పల్‌లో వెంకటేష్ సందడి

ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాలీవుడ్‌ అగ్ర హీరో వెంకటేష్‌ సందడి చేశారు. క్రికెట్ ప్రేమికుడైన వెంకటేష్‌ టీమిండియా ఆడే మ్యాచ్‌ల్లోనూ అప్పుడప్పుడూ తళుక్కున్న మెరుస్తారు. సమయం ఉంటే హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు తప్పకుండా వస్తుంటారు. హైదరాబాద్‌ జట్టుకు మద్దతుగా గత ఐపీఎల్‌ సీజన్‌లోనూ పలు మ్యాచ్‌లను నేరుగా వీక్షించిన వెంకటేష్‌ ఆదివారం హైదరాబాద్‌-బెంగళూరు మ్యాచ్‌కు విచ్చేసి గ్యాలరీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు చేలరేగిన ఆడినప్పుడు ముఖ్యంగా బెయిర్‌స్టో శతకం చేసినప్పుడు ఆనందంతో చిందులు వేశారు.