Politics

మోడీపై విరుచుకుపడిన కేజ్రీవాల్

మోడీపై విరుచుకుపడిన కేజ్రీవాల్

రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమైనవని ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. చంద్రబాబు ఏపీని మోడర్న్‌ రాష్ట్రంగా మార్చారని, ఆయన మరోసారి సీఎం కావాలని ఆకాంక్షించారు. విశాఖలో నిర్వహించిన తెదేపా భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల ఎన్డీయే పాలనా విధానాలను ఎండగట్టారు.