Movies

కథ రెడీ – దర్శకుడే లేడు

prabhas samantha dilraju

కథానాయిక సమంత.. పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్స్‌తో కలిసి నటించారు. కానీ ఇప్పటి వరకు ఆమె, ప్రభాస్‌ కలిసి నటించలేదు. అయితే అది త్వరలోనే జరుగుతుందని చెబుతున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఓ మంచి స్క్రిప్టు ఆయన వద్ద ఉందని, నైపుణ్యం ఉన్న దర్శకుడి కోసం చూస్తున్నారని సమాచారం. ఇందులోని ఓ ప్రత్యేక పాత్రలో సమంతను తీసుకోవాలని దిల్‌రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపారని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులపై దిల్‌రాజు స్పందించాల్సి ఉంది. సమంత నటించిన ‘మజిలీ’ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కాబోతోంది. మరోపక్క ఆమె టైటిల్‌ రోల్‌ పోషించిన ‘ఓ బేబీ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం ఆమె ‘96’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ ‘సాహో’లో నటిస్తున్నారు. అదేవిధంగా ఎస్‌. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు.