Movies

దర్శకత్వంపై ఓ నిర్ణయానికి వచ్చేస్తాను

aishwarya rai direction

ఉత్తరాది, దక్షిణాది…రెండు చోట్లా ఎంతోమంది అభిమానులున్న నాయికల్లో నీలికళ్ల సుందరి ఐశ్వర్యరాయ్‌ది ముందు వరసే. అందంలోనే కాదు…నటనలోనూ తనేంటో నిరూపించుకుంది. అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకుంది. చిత్ర రంగంలో కొంత పేరు, డబ్బు సంపాదించాకా చిత్ర నిర్మాణం, దర్శకత్వం వైపు అడుగులేస్తున్నారు చాలామంది నాయికలు. మరి సంవత్సరాల తరబడి చిత్ర సీమను ఏలిన ఐశ్వర్యకు నిర్మాత, దర్శకురాలు అనిపించుకోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదా? అంటే వచ్చిందనే చెబుతోంది ఐశ్వర్య. మరి నిర్మాత అవతారం ఎప్పుడు అంటే ‘‘సినిమా నిర్మించే విషయంలో చర్చలైతే నడుస్తున్నాయి. ఈ విషయంలో నాకు తెలిసిన అందరి నుంచీ సలహాలు తీసుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికైతే నిర్మాత కావడంపై అంతగా దృష్టిపెట్టడం లేదు’’అని చెప్పింది. మరి మెగాఫోన్‌ మాటేమిటంటే…? ‘‘ఏదో ఒక రోజు కచ్చితంగా దర్శకత్వం చేస్తాను. సమయం కుదరక ఈ విషయంపై అంతగా దృష్టిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నా మిత్రులు కూడా చాలామంది అదే అంటున్నారు. ‘నువ్వెందుకని చిత్ర నిర్మాణం, దర్శకత్వం చేయట్లేదు. చేస్తే బాగుంటుంది’’అని సలహా ఇస్తున్నారు. తొందర్లోనే దర్శకత్వంపై ఓ నిర్ణయానికి వచ్చేస్తాను’’ అని చెప్పింది ఐశ్వర్య.