Sports

ఆతిథ్యమా? అనురాగమా?

jonny bairstow love affair in ipl

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడు మీదుంది. ప్రత్యర్థి ఎవరైనా కసిగా చెలరేగాలన్న తపనతో ఆ జట్టు ఆటగాళ్లు కనిపిస్తున్నారు. మొన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై హైదరాబాద్‌ ఆట భీకరంగా సాగింది. ఓపెనర్లు జానీ బెయిర్‌ స్టో (114; 56 బంతుల్లో 12×4, 7×6), డేవిడ్‌ వార్నర్‌ (100 నాటౌట్‌; 55 బంతుల్లో 5×4, 5×6) అద్వితీయ శతకాలతో చెలరేగారు. ఇక బౌలర్లు సైతం వారి బాటలోనే పయనించారు. నిష్కర్షగా బంతులు విసిరారు. 232 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేనను 113 పరుగులకే ఆలౌట్‌ చేశారు. జోరుమీదున్న సన్‌రైజర్స్‌ తర్వాతి మ్యాచ్‌ కోసం దిల్లీ చేరుకుంది. అక్కడే జరిగిందో విచిత్ర సంఘటన.. దిల్లీలో అడుగుపెట్టిన హైదరాబాద్‌ ఆటగాళ్లు బస చేసేందుకు ఓ హోటల్‌కు వెళ్లారు. వారికి సిబ్బంది సంప్రదాయ పద్ధతిలో పట్టు శాలువాలతో సత్కరించారు. శతక వీరుడు జానీ బెయిర్‌స్టో మెడలో ఓ యువతి పట్టు శాలువా కప్పింది. ఆ సమయంలో వారిద్దరి కళ్లూ… కళ్లూ కలిశాయి. ఇకేముందీ ‘నీ కంటి చూపుల్లో ఏ మంత్రం వేశావే..’ అన్న చందాన అక్కడ ఎన్నెన్నో భావాలు కనిపించాయి. ఆ ఫొటోను సైతం ఫొటోగ్రాఫర్‌ అద్భుతంగా చిత్రీకరించాడనే చెప్పాలి. వీరిద్దరి చూపుల కలయికను నెటిజన్లు సాక్షి-ధోనీతో ముడిపెడుతున్నారు.