Devotional

టిటిడీ సేవా టికెట్లు విడుదల

2019 ttd tickets released

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. జూలై నెలలో వివిధ సేవలకు సంబంధించి.. 73 వేల 603 టికెట్లు తితిదే వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి.ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10 వేల 753 సేవా టికెట్లు కేటాయించారు. సేవల వారీగా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి.12. తిరుమలవార్షిక సంవత్సర ముగింపుతో శ్రీవారి ఆదాయ వివరాలు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. గతేడాదిలో రూ. 1214 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమయ్యే ఒంటిమిట్ట కోదండస్వామి బ్రహ్మోత్సవాలకు… విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
1. రేపటి నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను శనివారం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలు 20 వరకు కొనసాగుతాయని, 14న పండుగ సందర్భంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా మండపంలో సీతారామ కల్యాణోత్సవం ఉంటుందని కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు. 15న పట్టాభిషేకం వేడుక నిర్వహిస్తామన్నారు. తెలుగు సంవత్సరం ‘ఉగాది’ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ముఖ్యమంత్రికి అందించడం ఆనవాయితీ. ఈసారి ఎన్నికల కోడ్‌ కారణంగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. బ్రహ్మోత్సవాలకు గవర్నర్‌ నరసింహన్‌ను ఆహ్వానించేందుకు ఆలయ పెద్దలు సిద్ధమవుతున్నారు.
2. శ్రీవారికి శివ్‌నాడార్‌ రూ.కోటి విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌నాడార్‌ గురువారం రాత్రి రూ.కోటి విరాళాన్ని సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై స్వామివారిని దర్శించుకున్న శివ్‌నాడార్‌ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ ద్వారా విరాళాన్ని తితిదేకు అందజేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతిసారీ రూ.కోటి తగ్గకుండా విరాళం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. శ్రీవారిని కూడా సాధారణ భక్తుడిలా దర్శించుకోవడం ఆయన ప్రత్యేకత. ఈ సందర్భంగా శివ్‌నాడార్‌ను తితిదే అధికారులు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అంద జేశారు
3. రామయ్య పెళ్లికి రామచిలుకల ఆహ్వానం
భద్రాచలం రామాలయంలో ఈ నెల 14న సీతారామ కల్యాణోత్సవానికి రావాలని రామ చిలుకలు ఆహ్వానం పలికాయి. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు నేతృత్వంలో గురువారం రాజమండ్రిలోని డైమండ్‌ పార్కులో మంత్రోచ్ఛారణ మధ్య ఈ క్రతువును నిర్వహించారు. గోటితో వొలిచిన తలంబ్రాలను మట్టి కలశాలలో ఉంచి వాటిని ఊరేగించారు. దేవుడి పెళ్లికి అందరూ రారండోయ్‌ అని చిలుకలతో పలికించారు. అష్టోత్తర శత నామార్చన చేసి కలశాలను పూజించి జై శ్రీరామ్‌ అంటూ నీరాజనాలు పలికారు. 12న వీటిని భద్రాచలంలో అప్పగించనున్నట్లు తెలిపారు.
4. తలనీలాల ఆదాయం రూ.4.79 కోట్లు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తకోటి మొక్కుబడిగా చెల్లించిన తలనీలాలను తితిదే ఈ-వేలం ద్వారా గురువారం విక్రయించింది. 8,400 కిలోల వరకు విక్రయించగా రూ.4.79 కోట్ల ఆదాయం వచ్చింది. తలనీలాలను ఐదు రకాలుగా విభజించడంతో పాటు తెల్లవెంట్రుకలను వేర్వేరుగా విక్రయించింది.
5. రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉగాది పండగను వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది నుంచే తిరుమలేశుని ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు శ్రీవారి సుప్రభాత సేవతో ఉగాది మొదలుకానుంది. శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని వేంచేపు చేసి దక్షిణాభిముఖంగా సేనాధిపతిని కొలువుదీర్చి ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదపద్మాల మీదనున్న శ్రీవికారినామ సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వీకరించి.. శ్రీవారికి నూతన పంచాంగ విశేషాలు వినిపించనున్నారు. ప్రత్యేకంగా శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఫలితాలు విన్నవిస్తారు. శ్రీదేవి, భూదేవులకు కూడా నక్షత్ర ఫలాలు నివేదిస్తారు. శనివారం సాయంత్రం చతుర్మాడ వీధుల్లో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీమలయప్పస్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ నూతన సంవత్సర శుభాశీస్సులతో పాటు దివ్యమంగళ దర్శనంతో భక్తకోటికి అనుగ్రహించనున్నారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని తితిదే ఉద్యానశాఖ రంగురంగుల పుష్పాలతో కనువిందుగా అలంకరిస్తోంది. విద్యుద్దీపాలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
6. శుభమస్తు
తేది : 5, ఏప్రిల్ 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న ఉదయం 12 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 17 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(నిన్న తెల్లవారుజాము 3 గం॥ 27 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 36 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : గ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 6 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 12 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 5 ని॥ వరకు)(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 6 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 25 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 32 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 8 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : మీనము
7. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 5
1908: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు జగ్జీవన్ రామ్ జననం. (మ.1986).
1918: వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు, రాజకీయవేత్త ఇటికాల మధుసూదనరావు జననం.
1922 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం (జ.1858).
1930 : మహాత్మా గాంధీ 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.
1937 : భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత చేగొండి వెంకట హరిరామజోగయ్య జననం.
1993 : భారతీయ సినిమానటి దివ్యభారతి మరణం (జ.1974).
1994 : అమెరికాకు చెందిన ఒక పాటల రచయిత మరియు స్వరకర్త కర్ట్ కోబెన్ మరణం (జ.1967)
8. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు శుక్రవారం 05-04-2019 ఉదయం 5 గంటల సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ……శ్రీ వారి దర్శనానికి 4 కంపార్ట్ మెంట్ ల లో వేచి ఉన్న భక్తులు…శ్రీ వారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..నిన్న ఏప్రిల్ 4 న 64,190 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.36 కోట్లు.
9. శ్రీకనకధారా స్తోత్ర పఠన ఫలితం
శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక రోజున భిక్షకి ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి యజమానురాలు పేదరికంతో ఎన్నో ఇaబ్బందులు పడుతోంది. తన ఆకలి తీర్చుకునే మార్గమే తోచక పస్తులుంటున్న ఆ పేదరాలు, శంకర భగవత్పాదులవారికి ‘ఏమీలేదు’ అని చెప్పలేకపోయింది. భిక్షను సమర్పించకుండగా స్వామిని పంపించడానికి ఆమెకి మనసు రాలేదు. అలాంటి పరిస్థితి తనకి వచ్చినందుకు ఆమె ఎంతో బాధపడింది. చివరికి తన దగ్గరున్న ఒక ఉసిరికాయను .. స్వామివారికి భిక్షగా సమర్పించింది.దాంతో ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందనే విషయం ఆయనకి అర్థమైపోయింది. ఆ పేదరాలి దారిద్ర్యాన్ని తొలగించమని శంకర భగవత్పాదులవారు .. లక్ష్మీదేవిని స్తుతించారు. దాంతో లక్ష్మీదేవి అనుగ్రహించి ఆ పేదరాలి ఇంట కనకధారను కురిపించింది. స్వామివారి చేసిన ఆ స్తోత్రమే ‘కనకధారా స్తోత్రం’ అయింది. ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతోన్న వాళ్లు .. దారిద్ర్య దుఃఖాన్ని అనుభవిస్తోన్న వాళ్లు ‘కనకధారా స్తోత్రం’ అనునిత్యం పఠించడం వలన, ఆశించిన ఫలితం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు
10. తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 4.79 కోట్లు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 4.79 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 8400 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి. తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది. మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 3,600 కిలోలను వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.26.01 లక్షల ఆదాయం సమకూరింది. కిలో రూ. 18,331/-గా ఉన్న బి క్యాట‌గిరి – 2,600 కిలోలను వేలానికి ఉంచగా 800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.146.65 లక్షల ఆదాయం సమకూరింది.రెండో రకం తలనీలాలో కిలో రూ.17,810/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 1,600 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.89.05 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా బి క్యాట‌గిరి – 5,700 కిలోలు వేలానికి ఉంచగా 1900 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.163.43 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది. మూడో రకం తలనీలాలో కిలో రూ.6,025/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 700 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.42.18 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,553/-గా ఉన్న బి క్యాట‌గిరి – 16,700 కిలోలు వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.55 ల‌క్ష‌ల‌ ఆదాయం సమకూరింది. కిలో రూ.1,800/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 4,300 కిలోలను వేలానికి ఉంచ‌గా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.5.40 ల‌క్ష‌ల ఆదాయం సమకూరింది. కిలో రూ.37/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 28,000 కిలోలను వేలానికి ఉంచ‌గా 4000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.48 ల‌క్ష‌ల ఆదాయం సమకూరింది.