DailyDose

రెండు రాష్ట్రాల్లో గరంగరం రాజకీయం–04/05

2019election-complete-news-andhra-telangana

*హరీష్ కే దిక్కు లేదు నాకేం పదవి ఇస్తాడు
‘టీఆర్ఎస్ నేత హరీశ్రావుకే పార్టీలో దిక్కులేదు.. ఆయన నాకేం నామినేటెడ్ పదవి ఇస్తడు’ అని కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మండిపడ్డారు. టీఆర్ఎస్ తో ములాఖతై తాను ప్రచారం చేయట్లేదని, నామినేటెడ్ పదవికి లొంగిపోయానని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం రామచంద్రాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అందుకే ప్రచారంలో వెనకడుగు వేస్తున్నాననే వార్తల్లో వాస్తవంలేదన్నారు.
*జనసేనకు షాక్
పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ విశాఖలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక సమయంలో పలువురు నేతలు జనసేనాను వీడుతుండటం పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మింగుడు పడటం లేదు. తాజాగా జాన్సేన ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు గుంటూరు బహ్రతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భారతి వైకాపాలోకి చేరారు. భారతి వైకాపాలో చేరడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్న గంటా వర్గం కూడా డీలా పడినట్టుగా తెలుస్తోంది. జనసేన నుంచి భారతి ద్వారా ఓట్లు ఆశించిన తెదేపా నేతలు ఆందోళనలో పడ్డారు.
* రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కాగడాల ప్రదర్శనలు
ఉగాది పర్వదినాన రేపు మేనిఫెస్టో విడుదల చేసుకుంటున్నామని…పౌరుషానికి ప్రతీకగా రేపు సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపడుతున్నామనీ చంద్రబాబు తెలిపారు. ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామన్న స్ఫూర్తితో కాగడాల ప్రదర్శనలు సాగాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతి కీర్తిని చాటుతూ గట్టిగా పోరాడతామని ఈ కాగడాల ర్యాలీలు చేపట్టాలన్నారు. ఈ నెల 7న అన్నిచోట్ల ప్రార్థనలు,పూజలు నిర్వహించాలని పార్టీ నేతలతో సీఎం అన్నారు. కుట్రలపై సర్వమతాలు మనకు అండగా నిలుస్తున్నాయన్నారు. ఈ నెల 8, 9న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పౌరుషాన్ని రగిల్చాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రం కోసం పోరాడాలి, ఎన్నికల యుద్ధంలో గెలవాలనే స్ఫూర్తిని నింపాలన్నారు. దేనికీ భయపడాల్సిన పనిలేదు.. విజయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
*సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం
స్రవ్త్రిక ఎన్నికల్లో పొతే చేయాలనీ అనుకోవడం లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈమీరకు శుక్రవారం నాడు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వయసు పైబడిన నేతలను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని భాజపా తీసుకున్న నిర్ణయంతో భాగంగా ఇటీవల ఎల్కే అద్వానీ , మురళీ మనోహర్ జోషీ వంటి పలువురు సీనియర్ నేతలకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపద్యంలో సుమిత్రా మహాజన్ కూడా టికెట్ ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలు బాగ్లంగా వినిపించాయి. అయితే ఈ విశాయ్మ్లో భీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్ధి ప్రకటన విషయాన్నీ వాయిదా వేస్తూ వస్తోంది.
* తెదేపా సీనియర్‌ నేతతో కేసీఆర్‌ కీలక భేటీ
తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లిన సీఎం రాష్ట్రంలోని తాజా రాజకీయాల పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఈ ఉదయం నుంచే ఆయనతో తెరాస ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, తెరాసలో చేరే అంశంపై ప్రధానంగా చర్చించారని, ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకే సీఎం నేరుగా మండవ నివాసానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
* తెలంగాణ అప్పులపాలైంది: విజయశాంతి
తెలంగాణలో హిట్లర్‌, దోపిడీ పాలన సాగుతోందని కాంగ్రెస్‌ ప్రచారతార విజయశాంతి అన్నారు. రైతుల నామినేషన్లతో దేశం మొత్తం నిజామాబాద్‌ వైపే చూస్తోందని చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాస్కీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలు తీర్చే సమయం కూడా ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌తోనే న్యాయం జరుగుతుందని.. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసే అవకాశముందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం అప్పులపాలైందన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆమె అన్నారు.
*కోడికత్తి దాడి తరహాలో మరో దాడి ఇది
కుట్రలో భాగంగానే తెదేపా నేతల పై దాడులు చేస్తున్నారని తెదేపా నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించెందుకే దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కోడికత్తి తరహాలో మరో దాడికి వైకాపా యత్నిస్తోందని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే కేసీఆర్, మోడీ కుట్ర పనంరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*సీఎం రమేశ్‌ నివాసంలో పోలీసుల తనిఖీలు
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌ నివాసంలో శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 30 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే సీఎం రమేశ్‌ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో సీఎం రమేశ్‌తో పాటు, ఆయన సోదరుడు సురేశ్‌ నాయుడు ఇంట్లోనే ఉన్నారు. మూడంతస్తుల భవనంలో పోలీసులు అణువణువూ సోదాలు చేపట్టారు.
*రాజకీయాల నుండి తప్పుకున్న బండ్ల గణేష్
సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌ వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టినవారిని పెద్ద మనసుతో క్షమించమని బండ్ల గణేష్‌ కోరారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తరమ్‌ కుమార్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని బండ్ల గణేష్‌ తెలిపారు.
*వైకాపా దౌర్జన్యకాండ
పుంగనూరులో వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మైలవరంలో రణరంగం సృష్టించారు. పోలీసులు, జవాన్ల పై చెప్పులు, రాళ్ళతో దాడులు చేశారు. పొన్నూరులో పాటశాల పిల్లల ఆటో పై దౌర్జన్యం చేశారు. ఇళ్ళల్లో అద్దెకుండే వాళ్ళ పై దాడులు చేస్తున్నారు. గర్భిణీ అని చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చడం, వ్రుద్దులనే కనికరం లేకుండా అర్ధరాత్రి సామాన్లు బయట పడేయటం లాంటి దుష్ట చర్యలకు వైకపా నేతలు పాల్పడుతున్నారు. వైకాపావన్నీ నేరాలు, ఘోరాలు ఆకృత్యాలే చంపడమో, చావడమో అని వైకాపా నేల్లోరు అభ్యర్ధి అంటున్నారు.
*ఎన్నికల కమీషన్ అండతోనే జగన్ ఆకృత్యాలు
ప్రధాని మోడీ కనుసన్నల్లో పని చేస్తున్న ఎన్నికల కమీషన్ అండతో జగన్ అండ్ కో రాష్ట్రంలో ఆకృత్యాలకు తెగబడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. మైలవరం సభలో జగన్ వ్యక్యలతోనే వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయి భద్రతా బలగాల పై దాడులు చేశారన్నారు. ప్రతిపక్ష నేతకు ఓటమి భయం పట్టుకుందన్నారు. గురువారం ఉండవల్లిలోని ప్రజవేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేయకుండా జగన్ తన బీనామీ సంస్థ జన చైతన్య వేదిక ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయిస్తున్నారు అని అన్నారు.
* అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు నిరసన
ఏపీ హక్కులను కాలరాశారని నిలదీసినందుకే.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. టీడీపీని నిర్వీర్యం చేయడం ద్వారా..ఏపీకి నష్టం చేయడంపై శుక్రవారం టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబు విజయవాడలోని తమ్మలపల్లి కళాక్షేత్రం, అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రదాని మోదీ రాష్ట్ర అభివృద్దికి నిధులు ఇవ్వకుండా, ఎదురుదాడి చేస్తూ తెలుగు జాతిని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
*ఈసీని జైల్లో పెడతా- ప్రకాశ్‌ అంబేడ్కర్‌
పుల్వామా ఉగ్రదాడి గురించి రాజకీయపార్టీలు మాట్లాడకుండా కట్టడి చేసినందుకు ఎన్నికల సంఘాన్ని(ఈసీ) రెండురోజుల పాటు జైల్లో పెడతానంటూ దళితనేత, పార్లమెంటు సభ్యుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదంలో పడేశాయి. యావత్‌మల్‌ జిల్లాలో జరిగిన సభలో చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యాఖ్యపై ఎన్నికల సంఘం గురువారం స్పందించింది. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది.
*చింద్వాడా బరిలో కమల్‌నాథ్‌ తనయుడు
మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ చింద్వాడా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఇదే అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కమల్‌నాథ్‌ పోటీ చేయనున్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ 12 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది.
*రేపు తెదేపా, వైకాపా మేనిఫెస్టోల విడుదల
రాష్ట్రంలో అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలను శనివారం ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నాయి. తెదేపా మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించనుండగా.. వైకాపా మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించనున్నారు. శుక్రవారమే మేనిఫెస్టో విడుదల చేయడంపై కూడా వైకాపాలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
*మరోసారి రాష్ట్రానికి రాహుల్‌
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ సభల్లో పాల్గొన్న ఆయన ప్రచారం ముగింపునకు ముందురోజు రాష్ట్రానికి రానున్నారు. భువనగిరి, మహబూబాబాద్‌లలో బహిరంగసభలను ఏర్పాటు చేయనున్నారు. అదేరోజు సాయంత్రం సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో జరిగే ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూలుకు ముందే చేవెళ్ల లోక్‌సభ పరిధిలో శంషాబాద్‌లో, ఏప్రిల్‌ ఒకటో తేదీన జహీరాబాద్‌, వనపర్తి, హుజూర్‌నగర్‌ బహిరంగసభల్లో ఆయన పాల్గొన్నారు.
*భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు
రాజకీయంగా వ్యతిరేకించే వారిని భాజపా ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆ పార్టీ వ్యవస్థాపక నేత ఎల్‌.కె.ఆడ్వాణీ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌ ఆరో తేదీ భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లాగులో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆయన బ్లాగులో రాయడం గమనార్హం. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఎన్నికల ప్రచారంలో జాతీయ భద్రతను ప్రధాన అంశంగా చేసుకోవడం, విపక్షనేతలు దేశ శత్రువులైన పాకిస్థాన్‌వారిలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆడ్వాణీ అభిప్రాయాలకు ప్రాధాన్యమేర్పడింది.
*గుర్తుల కోసం కోర్టు గుమ్మానికి
తమకు ఎన్నికల గుర్తులను కేటాయించేలా.. వాటి నమూనాలను అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన పసుపు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా తమకు గుర్తులను, నమూనాలను కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ సుంకేట రవి మరో 15 మంది హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌ మోషన్‌ (భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ) పిటిషన్‌ దాఖలు చేశారు.
*గుర్తులు కేటాయించలేదనేది అబద్ధం
నిజామాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ అన్నారు. ప్రతి ఒక్కరికీ మూడేసి గుర్తులు చూపించి వాటిలో వారు ఎంచుకున్న దాన్ని కేటాయించామని స్పష్టం చేశారు. గురువారం సీఈవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
* దిల్లీలో సీట్లపై కాంగ్రెస్‌, ఆప్‌ చర్చలు
దిల్లీలో కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌)ల మధ్య పొత్తు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిని సర్దుబాటు చేసుకునే విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ బుధవారం సాయంత్రం ఏఐసీసీ ఇన్‌ఛార్జి పి.సి.చాకోతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వడానికి ఆప్‌ ముందుకురాగా, మూడు సీట్లు కావాలని ఆ పార్టీ అడుగుతోంది.
* 75ఏళ్లు పైబడిన వారికి టిక్కెట్‌ ఇవ్వకూడదనేది పార్టీ నిర్ణయం
వయస్సు 75 ఏళ్లు పైబడిన వారికి టిక్కెట్‌ ఇవ్వకూడదనేది పార్టీ నిర్ణయమని, అందుకే ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌జోషిలాంటి వారు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. పార్లమెంటుకు వెళ్లడానికి ప్రజల ప్రత్యక్ష తీర్పు కోరాలని నిర్ణయించుకున్నానని, అందుకే సాధారణ ఎన్నికల్లో పోటీకి దిగానన్నారు. మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపడతారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపడేశారు. రాజ్యసభ సభ్యుడు కూడా కేంద్ర మంత్రి కావొచ్చని గుర్తు చేశారు. ‘ది వీక్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
* చింద్వాడా బరిలో కమల్‌నాథ్‌ తనయుడు
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ చింద్వాడా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఇదే అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కమల్‌నాథ్‌ పోటీ చేయనున్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ 12 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ ఇప్పటివరకు 369 స్థానాలకు అభ్యర్థుల జాబితాను వెల్లడించినట్లయింది.
*అయిదేళ్లలో పేదలందరికీ ఇళ్లు
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కొంత తాత్సారం జరిగినా వచ్చే అయిదేళ్లలో అర్హులైన పేదలందరికీ గృహాలు నిర్మించి ఇస్తామని నిజామాబాద్‌ ఎంపీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆమె హాజరై ప్రసంగించారు. సొంత స్థలం ఉన్నవారికి సైతం గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చడానికి రైతుల పంట ఉత్పత్తులను వారి చేత కొనుగోలు చేయిస్తామన్నారు. వారు కమిషన్‌ ద్వారా ఆదాయం పొంది, ప్రజలకు న్యాయంగా సరకులను అందిస్తారని చెప్పారు. రాష్ట్ర సర్కారు వచ్చే మే నెల నుంచి పింఛను రూ.2016 అందిస్తుందన్నారు.
*ఏమారితే 30 ఏళ్లు వెనక్కి
నేను యజ్ఞం చేస్తుంటే వాళ్లు భగ్నం చేస్తున్నారు. భద్రాచలం మునిగిపోతుందనే కుంటిసాకుతో పోలవరంపై తెరాస నేతలు కేసు వేశారు. అసలు భద్రాచలమే మాది.. మేమే తీసుకుంటాం. ఏమవుతుందో చూసుకుంటాం. ఈ యుద్ధంలో మనం ఏమారితే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లి బిహార్‌లా తయారవుతుంది. అందుకే నా పోరాటానికి చెల్లెళ్లు, తమ్ముళ్లు సహకరించాలి. మోదీ, కేసీఆర్‌, జగన్‌ల అధర్మ యుద్ధాన్ని తిప్పికొట్టాలి. ‘మోదీ… మీరు దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. మా ఉసురు మీకు తగులుతుంది. మీ ఉద్యోగం శాశ్వతం కాదు’ అని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘మీరు దాడులు చేస్తే మేం భయపడం. మరో 10 సీట్లు ఎక్కువే గెలుస్తాం’ అని స్పష్టం చేశారు. ఏపీలో ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి, గుంటూరు జిల్లా పెదనందిపాడు, బాపట్లలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. మోదీ మళ్లీ గెలుస్తారని నిన్న మాట్లాడిన జగన్‌ చెబుతున్నారు. మోదీ అధికారంలోకి రానేరారు. నేను రానీయను. దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపిస్తా. మనకు అన్యాయం చేసి మట్టి కొట్టిన మోదీకి గుణపాఠం చెబుతా’ అని పేర్కొన్నారు.
*వైకాపా దౌర్జన్యకాండ
‘పుంగనూరులో వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మైలవరంలో రణరంగం సృష్టించారు. వైకాపావన్నీ నేరాలు, ఘోరాలు, అకృత్యాలే. చంపడమో, చావడమో అని వైకాపా నెల్లూరు అభ్యర్థి అంటున్నారు’ అని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు, బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రలతో గురువారం టెలికాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు.
*కల్యాణ్‌సింగ్‌కు పదవీ గండం?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున ప్రచారం చేశారన్న ఆరోపణలపై రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించే పరిస్థితి వచ్చిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఓ గవర్నరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలను ఎదుర్కోవడం స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి. గవర్నర్‌ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి లేఖ రాసింది.
*హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి తెరాసలో చేరిక
రెండు ఎంపీ స్థానాలతోనే రాజకీయ పార్టీలను కదిలించి, తెలంగాణను సాధించిన కేసీఆర్‌.. 16 ఎంపీ స్థానాలు సాధిస్తే ఎన్నో అద్భుతాలను సాధించి చూపుతారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌కు ప్రధాని కావాలన్న కోరిక లేదని, దేశ గతి మార్చేందుకు ఎంపీల బలంతో తన శక్తి మేరకు పని చేస్తారన్నారు. దేశవ్యాప్తంగా 300 స్థానాలు గెలుస్తామంటున్న భాజపా నేతలు దమ్ముంటే తెలంగాణలో 3 లోక్‌సభ స్థానాలు గెలిచి చూపాలని సవాలు చేశారు.
*భాజపా సభలో జర్మనీ చలువ పందిరి
మండుతున్న ఎండలను తట్టుకునేందుకు, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు.. జర్మనీ పరిజ్ఞానంతో రూపొందించిన చలువ పందిరి ఇది. ఒకచోటి నుంచి మరోచోటుకు తరలించడానికి అనువుగా ఉంటుంది. కరీంనగర్‌లో గురువారం నిర్వహించిన సభకు దీన్ని ఉపయోగించారు. ఇటీవల మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో జరిగిన భాజపా బహిరంగ సభల్లోనూ ఈ పందిరిని వినియోగించారు. వేగంగా వీచే గాలులను, వర్షాన్ని కూడా ఇది తట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
*కాంగ్రెస్‌ పాలనకు నమూనాలా మేనిఫెస్టో
కేంద్రంలో రాబోయే తమ ప్రభుత్వ పాలనకు నమూనాలా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)ను రూపొందించామని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ ఎంవీ రాజీవ్‌గౌడ పేర్కొన్నారు. ఇందులోని ప్రధానాంశాలను హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 174 విభిన్న వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపి మేనిఫెస్టో తయారు చేశామన్నారు.
*సోనియాగాంధీ పర్యటనలో మార్పు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ నాయకురాలు, యూపీయే అధ్యక్షురాలు సోనియాగాంధీ వికారాబాద్‌ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందు నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల 8న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం, మీర్జాపూర్‌ గేటు వద్ద భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది.
*‘న్యాయ్‌’ కోసం మధ్యతరగతిపై పన్ను భారం ఉండదు
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘న్యాయ్‌’ పథకం అమలు కోసం మధ్యతరగతి ప్రజలపై అదనపు పన్ను భారం వేయబోదని ఆ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం స్పష్టం చేశారు. పన్ను భారం పెంచబోమని ఇంతకుముందు పత్రికా సమావేశంతోపాటు, పలు ముఖాముఖిల్లో చెప్పామని, ఇది తమ హామీ అని ఆయన ట్వీట్‌ చేశారు.
*రాజ్‌నాథ్‌పై విపక్షాల ఉమ్మడి పోరు
ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ రసవత్తర పోరుకు సిద్ధమవుతోంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా సతీమణి పూనమ్‌ సిన్హా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయనపై ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని విపక్ష ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించాయి.
*కేరళలో రాహుల్‌ స్థానికుడా?
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారతదేశానికి చెందిన వారైతే సరిపోతుందని కరీంనగర్‌ తెరాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానికత అంశాన్ని ప్రస్తావించడం సబబు కాదన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారంలో గురువారం వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబుతో కలసి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
*కేసీఆరే అసలైన లౌకికవాది
ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు సిసలైన లౌకికవాది అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. కులాలు, మతాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. తెరాస జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం నిర్వహించిన పార్టీ మైనారిటీ విభాగం కార్యకర్తల సమావేశాల్లో హోం మంత్రి పాల్గొన్నారు.
*అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు
‘అగ్రిగోల్డ్‌ బాధితులకు ఐదేళ్లలో ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేకపోయింది. పైగా వాటి ఆస్తులను దోచేయడంపై చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, మంత్రులు దృష్టి పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం. తొలి బడ్జెట్‌లోనే రూ.1150 కోట్లు కేటాయించి 13 లక్షల మంది బాధితులకు అండగా ఉంటాం. మిగిలిన వారికి ఆ తర్వాత న్యాయం చేస్తాం’ అని వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగరం, కర్నూలు జిల్లా నంద్యాల, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, హిందూపురం సభలలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న 65 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్‌ ప్రకటించారు. వేతనాలు పెంచాలని హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు కోరితే ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేసిందని ఆరోపించారు.
*ఆంధ్ర రాష్ట్రాన్ని బలోపేతం చేస్తాం
‘భాజపా రోజుకో కొత్త నాటకం ఆడుతోంది. గత ఎన్నికల్లో ఛాయ్‌వాలా అని ఇప్పుడు చౌకీదార్‌ అని ప్రజల ముందుకు వస్తోంది. ఇలాంటి నాటకాలు మోదీని కాపాడలేవ’ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ జవాన్ల శవాలతోనూ రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇవేవీ ఆయనను రక్షించవని వ్యాఖ్యానించారు. జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సంయుక్తంగా గురువారం తిరుపతిలోని తారకరామా మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల యుద్ధభేరి సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలసి పాల్గొన్నారు.
*అమరావతి, పోలవరం భాజపాతోనే సాధ్యం
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రులు కలలు కన్న రాజధాని అమరావతిని, పోలవరం నిర్మాణాలను అద్భుతంగా నిర్మిస్తామని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా హామీనిచ్చారు. వీటి నిర్మాణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల సాధ్యం కాబోవని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని, మరోసారి కూటమిలోకి రావాలనే యోచనలో చంద్రబాబు ఉన్నా ద్వారాలు మూసుకుపోయాయని చెప్పారు.
*తెదేపా లక్ష్యంగా ఐటీ సోదాలు
ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులు, నేతల లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తోందని ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేసింది. ఐటీ శాఖపై చర్యలు తీసుకోవాలని కోరింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, పార్టీ రాష్ట్ర మీడియా వ్యవహారాల సమన్వయకర్త దారపనేని నరేంద్ర తదితరులు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు ముగ్గురు తెదేపా అభ్యర్థుల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయని, నామినేషన్లు వేసిన తర్వాత ఇలా తనిఖీలు చేయడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని వారు పేర్కొన్నారు.
*పసుపు-కుంకుమలో జోక్యం చేసుకోం
పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల చెల్లింపుల నిమిత్తం నిధుల విడుదలను నిలువరించడానికి హైకోర్టు నిరాకరించింది. నిధుల విడుదలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) పచ్చజెండా ఊపిందని, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే లబ్ధిదారులకు పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇచ్చామని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు తెలిపారు.
*భాజపా వ్యయం రూ.1.21 కోట్లు
మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు ఇంకా వారంరోజులు మాత్రమే ఉండటంతో అధికార భాజపా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తోంది. గూగుల్‌తో పాటు యూట్యూబ్‌లాంటి దాని అనుబంధ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనల కోసం రూ.1.21 కోట్లు వ్యయం చేసింది. కాంగ్రెస్‌ రూ.54,100 వ్యయం మాత్రమే చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 4 వరకు భారత్‌లోని వివిధ పార్టీలు, వాటికి సంబంధించిన ప్రకటనల ఏజెన్సీలు రూ.3.76 కోట్ల విలువైన ప్రకటనలు గుప్పించాయని పేర్కొంటూ గూగుల్‌ గురువారం ‘‘రాజకీయ ప్రకటనలపై పారదర్శక నివేదిక’’ను విడుదల చేసింది.
*కల్యాణ్‌సింగ్‌కు పదవీ గండం?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున ప్రచారం చేశారన్న ఆరోపణలపై రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించే పరిస్థితి వచ్చిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఓ గవర్నరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలను ఎదుర్కోవడం స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి. గవర్నర్‌ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి లేఖ రాసింది.
*ఐదేళ్లలో రూ.ఆరున్నర కోట్లు పెరిగిన రాహుల్‌ ఆస్తి
‘ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆస్తులు గత ఐదేళ్లలో రూ.9.4 కోట్ల నుంచి రూ.15.88 కోట్లకు (ఆరున్నర కోట్లు) పెరిగాయి. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి గురువారం దాఖలు చేసిన నామినేషన్‌లో ఆయన ఈ మేరకు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో తన మొత్తం ఆస్తులు రూ.9.4 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం రాహుల్‌గాంధీకి కారు లేదు. ఎస్పీజీ భద్రత ఉన్నందున ఎస్పీజీ వాహనంలోనే ప్రయాణిస్తున్నానని తెలిపారు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.72 లక్షల అప్పులున్నట్లు తెలిపారు.
*‘అమరావతి, పోలవరం భాజపాతోనే సాధ్యం
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రులు కలలు కన్న రాజధాని అమరావతిని, పోలవరం నిర్మాణాలను అద్భుతంగా నిర్మిస్తామని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా హామీనిచ్చారు. వీటి నిర్మాణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల సాధ్యం కాబోవని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని, మరోసారి కూటమిలోకి రావాలనే యోచనలో చంద్రబాబు ఉన్నా ద్వారాలు మూసుకుపోయాయని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 14 అంశాలలో 11 అంశాలను ఐదేళ్లలోపే పూర్తి చేశామని తెలిపారు.
*భాజపా వ్యయం రూ.1.21 కోట్లు
మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు ఇంకా వారంరోజులు మాత్రమే ఉండటంతో అధికార భాజపా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తోంది. గూగుల్‌తో పాటు యూట్యూబ్‌లాంటి దాని అనుబంధ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనల కోసం రూ.1.21 కోట్లు వ్యయం చేసింది. కాంగ్రెస్‌ రూ.54,100 వ్యయం మాత్రమే చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 4 వరకు భారత్‌లోని వివిధ పార్టీలు, వాటికి సంబంధించిన ప్రకటనల ఏజెన్సీలు రూ.3.76 కోట్ల విలువైన ప్రకటనలు గుప్పించాయని పేర్కొంటూ గూగుల్‌ గురువారం ‘‘రాజకీయ ప్రకటనలపై పారదర్శక నివేదిక’’ను విడుదల చేసింది.
*ఐదేళ్లలో రూ.ఆరున్నర కోట్లు పెరిగిన రాహుల్‌ ఆస్తి
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆస్తులు గత ఐదేళ్లలో రూ.9.4 కోట్ల నుంచి రూ.15.88 కోట్లకు (ఆరున్నర కోట్లు) పెరిగాయి. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి గురువారం దాఖలు చేసిన నామినేషన్‌లో ఆయన ఈ మేరకు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో తన మొత్తం ఆస్తులు రూ.9.4 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం రాహుల్‌గాంధీకి కారు లేదు. ఎస్పీజీ భద్రత ఉన్నందున ఎస్పీజీ వాహనంలోనే ప్రయాణిస్తున్నానని తెలిపారు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.72 లక్షల అప్పులున్నట్లు తెలిపారు
*సీనియర్‌ నేతలకు మల్కాజిగిరి బాధ్యతలు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో తెరాస అధిష్ఠానం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిసింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బుధవారం అర్థరాత్రి వరకు దాదాపు 4 గంటల పాటు పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు. వారికి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.
*ఈనెల 11న సోనియా నామినేష‌న్‌
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, యూపీఏ చైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలోని రాయ్‌బ‌రేలీ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఈనెల 11వ తేదీన ఆమె రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గంలో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. రాహుల్ ఈనెల 10వ తేదీన అమేథీలో నామినేష‌న్ వేస్తారు. సోనియా, రాహుల్ నామినేష‌న్ దాఖ‌లు చేస్తున్న స‌మ‌యంలో ఏఐసీసీ కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ కూడా హాజ‌రుకానున్నారు. రాహుల్ గురువారం కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లోనూ నామినేష‌న్ వేశారు.
*తొమ్మిది ఓట్ల ఎంపీ
1989 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి కొణతాల రామకృష్ణ తొలిసారి పోటీ చేశారు. అప్పటికే ఎంపీగా ఉన్న పెతకంశెట్టి అప్పలనరసింహం కే తెదేపా తిరిగి టికెట్ ఇచ్చింది. మొత్తం 8,93,262 ఓట్లకు 6,59,253 ఓట్లు పోలయ్యాయి. కొనతాలకు 2,99,109ఓట్లు రాగా తెదేపా అభ్యర్ధికి 2,99,100 ఓట్లు వచ్చాయి. కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచినా కొణతాల తర్వాత 1991లో జరిగిన మద్యంతర ఎన్నికల్లో తిరిగి అప్పల నరసింహం పై పోటీ చేసి 11,148 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. తొలిసారి ఎంపీగా పార్లమెంటుకు వెళ్ళిన సమయంలో రాజీవ్ గాంధీ సరదాగా ఏం తొమ్మిది ఓట్ల ఎంపీ అంటూ పలకరించేవారు. 1991లో గెలిచినా తరువాత ఆయన రాష్ట్ర కాంగ్రెస్ ను ఎంపీల కన్వినరుగా పనిచేశారు.
*సగానికి పైగా కుర్చీలు ఖాళీ
గుంటూరు జిల్లా నరసరావు పేటలో నిర్వహించిన అమిత్ షా సభకు స్పందన కరువైంది. జనం లేక సభా ప్రాంగణం వెలవెల బోయింది. సగానికి పైగా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. నరసరావుపేట, ఇతర ప్రాంతాల నుంచి జనసమీకరణ చేసినా ప్రాంగణం నిండలేదు. అయితే సభకు తీసుకువచ్చిన వారికి స్లిప్ లు పంపిణీ చేశారు. జనం క్యూలో నిలుచుని వీటిని తీసుకున్నారు. ఈ స్లిప్ లు చూపించిన వారికి డబ్బులు ఇచ్చే విధంగా నాయకులూ ఏర్పాట్లు చేశారు.