ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్ ఏ380 సూపర్‌జంబో తయారీ ఆపేస్తున్నామంటూ ప్రకటించింది ఎయిర్‌బస్ కంపెనీ. ఘనమైన రికార్డున్న ఈ విమానం గురించి ఓసారి మననం చేసుకుందాం.
1.78లక్షల కోట్లు
ఎయిర్‌బస్ పరిశోధన, డిజైన్ కోసం పెట్టిన ఖర్చు
12 సంవత్సరాలు
విమానం సర్వీసు అందించిన కాలం
1,050 కిలోమీటర్లు/గం
ఎయిర్‌బస్ గంటలో ప్రయాణించే వేగం. అంటే దాదాపు గంటా ఇరవై నిమిషాల్లో హైదరాబాద్ నుంచి దిల్లీకి చేరొచ్చు.
3.20లక్షల లీ.
విమానంలో ఇంధనం నిల్వ సామర్థ్యం
72.7 మీటర్లు
విమానం పొడవు. దాదాపు ఆరు బస్సులకు సమానం.
79.8 మీటర్లు
రెండు రెక్కల మధ్య ఉండే దూరం.
853 మంది
ఒక్కసారి ఎయిర్‌బస్‌లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య
A380 జంబోజెట్ తయారీ నిలిపేస్తున్నాం
Related tags :