తెలంగాణలో హిట్లర్, దోపిడీ పాలన సాగుతోందని కాంగ్రెస్ ప్రచారతార విజయశాంతి అన్నారు. రైతుల నామినేషన్లతో దేశం మొత్తం నిజామాబాద్ వైపే చూస్తోందని చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలు తీర్చే సమయం కూడా ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్‌తోనే న్యాయం జరుగుతుందని.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశముందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం అప్పులపాలైందన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆమె అన్నారు.
దేశం మొత్తం నిజామాబాద్ వైపే

Related tags :