Movies

రజ్జో మజ్జా

sonakshi in dabangg3

సోనాక్షీ సిన్హా కథానాయికగా పరిచయమైన హిందీ చిత్రం ‘దబాంగ్‌’. అందులో రజ్జో పాత్రలో నటించారామె! చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ఖాన్‌ నటనకు ఎంత పేరొచ్చిందో… రజ్జోగా సోనాక్షీకీ అంతే పేరొచ్చింది. సల్మాన్‌, సోనాక్షి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకొంది. ‘దబాంగ్‌ 2’లో మరోసారి సేమ్‌ జోడీ కనువిందు చేసింది. ‘దబాంగ్‌ 3’లోనూ సందడి చేయనుంది. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్‌’ ఫ్రాంచైజీలో మూడో సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. సోనాక్షీ సిన్హా గురువారం సెట్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా ‘‘రజ్జో ఈజ్‌ బ్యాక్‌!!! ‘దబాంగ్‌’ నుంచి ‘దబాంగ్‌ 3’ వరకూ… ఇంటికి వచ్చినట్టుంది. ఈ రోజు షూటింగ్‌ ప్రారంభించా. నాకు అంతా మంచి జరగాలని దీవించండి’’ అని ఆమె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ‘రౌడీ రాథోడ్‌’, ‘ఆర్‌… రాజ్‌కుమార్‌’, ‘యాక్షన్‌ జాక్సన్‌’ చిత్రాల తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షీ సిన్హా నటిస్తున్న చిత్రమిది.