NRI-NRT

కవితను గెలిపించాలని లండన్ ఎన్నారైల విజ్ఞప్తి

nritrs uk requests votes for kavitha

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని రికార్డు మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యర్థి కవిత గారికి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుందని .మా సంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా,మా లాంటి ఎందరో ప్రవాసులకు ఎల్లవేళలా అండగా వుంటూ,ముఖ్యంగా ఆపదలో వున్న ఎన్నారై బిడ్డలకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్న కవితక్క గారు నిజామాబాద్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం వారి అదృష్టమని తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ ఎన్నారై బిడ్డలు ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి ఎన్నో రకాలుగా అండ దండగా ఉన్న నాయకురాలు కేవలం కవిత గారు మాత్రమే, నేడు వారి గెలుపుతో ఇంకెన్నో జీవితాలు బాగుపడతాయని, అనుక్షణం నిజామాబాద్ ప్రజల శ్రేయస్సుకై అలుపెరుగని కృషి చేస్తూ, అన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పై రాజీలేని పోరాటం చేస్తున్న కవిత గారిని భారీ మెజారిటీ తో గెలిపించుకోవడం నేడు చారిత్రాత్మక అవసరమని విజ్ఞప్తి చేసారు. నిజామాబాద్ రైతులు,ప్రజలు సంతోషంగా వుండాలన్నా, మా లాంటి ఎన్నారై బిడ్డల జీవితాలకు భరోసా వుండాలన్నా కవిత గారిని మళ్ళీ పార్లమెంట్ కి పంపించాల్సిన బాధ్యత నిజామాబాద్ ప్రజలందరిది కాబట్టి మీరంతా ఇతర పార్టీ ల ప్రలోభాలకి, లేని పోని తప్పుడు వాగ్ధానాలకి అవకాశం లేకుండా కవిత గారిని భారీ మెజారిటీ తో గెలిపియ్యాలని కోరారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో అధ్యక్షురాలు పవిత్ర కంది, సలహామండలి చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మరియు ఉపాధ్యక్షుడు సేరు సంజయ్ ఉన్నారు.