Movies

నువ్వు పిలిస్తే నేను రానంటానా?

amala joins twitter on nagarjunas request

నటి అక్కినేని అమల వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ‘హై ప్రీస్టెస్’ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. పుష్ప ఇగ్నేషియస్‌ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫ‌స్ట్‌లుక్‌ను నాగార్జున శనివారం విడుద‌ల చేశారు. ‘అమల కొత్త అవతారం చూడాలని ఆతృతగా ఉంది. దీనికి సంబంధించిన టీజర్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్నా. అమల ఇది నువ్వు ట్విటర్‌లో జాయిన్‌ అవ్వాల్సిన సమయం’ అని నాగ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అమల శనివారం ట్విటర్‌ ఖాతా తెరిచారు. ‘నీ సలహా తీసుకుని.. నేను వచ్చేశా’ అని నాగ్‌కు రిప్లై ఇచ్చారు. ‘హ హ.. చాలా వేగంగా వచ్చేశావ్‌. ట్విటర్‌కు స్వాగతం డియర్‌’ అని నాగ్‌ ప్రతిస్పందించారు. 1992లో నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత అమల నటనకు దూరం అయ్యారు. వరుస చిత్రాలు తీయడం ఆపేశారు. 2012లో ‘లైఫ్ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారు. 2014లో ‘మనం’ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేశారు. 2017లో అమల ‘కేరాఫ్‌ సైరాభాను’ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ క్రమంలో పలు హిందీ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.