Movies

గాంధీ చిత్రంలో బిజీ

vidya balan quit jayalalithas biopic for indira

????????????☘?????????☘???????????????☘????????????
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఇప్పటికే దాదాపు మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తమిళంలో ‘తలైవి’ పేరుతో ఓ బయోపిక్‌ రాబోతోంది. తొలుత ఇందులో విద్యా బాలన్‌ను ఎంపిక చేసుకోవాలనుకున్నారట. కానీ ఆమె ఒప్పుకోలేదు. దాంతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను ఎంచుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితాధారంగా ఓ వెబ్‌సిరీస్‌లో విద్య నటించాల్సి ఉంది. దాదాపు ఏడాది నుంచి ఈ వెబ్‌సిరీస్‌ కోసం పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ వెబ్‌సిరీస్‌ను పూర్తిచేయాలన్న ఉద్దేశంతో జయలలిత బయోపిక్‌కు విద్య నో చెప్పారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. సాగరికా ఘోష్‌ రాసిన ‘ఇందిరా: ఇండియాస్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పుస్తకం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను రోన్నీ స్క్రూవాలా నిర్మించనున్నారు. ఇందుకోసం ఇందిరా గాంధీ కుటుంబీకులను కలిసే పనిలేకుండా ముందుగానే హక్కులను కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ‘జయ’ బయోపిక్‌కు ప్రముఖ తమిళ నటుడు ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘తలైవి’ సినిమాను హిందీలో ‘జయ’ పేరిట విడుదల చేయనున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథ రాస్తున్నారు. మరోపక్క తమిళంలో మరో ఇద్దరు దర్శకులు జయలలిత బయోపిక్ తీస్తున్నారు.