Politics

తెదేపా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు

chandrababu releases tdp 2019 manifesto

తెలుగుదేశం పార్టీ మానిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

* తెలుగుదేశం పార్టీపై 37ఏళ్లుగా ప్రజాదరణ
* 22ఏళ్లు అధికారంలో టిడిపి ఉండటం చరిత్ర
* టిడిపి పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, నమ్మకం
* 2004-14 ఉమ్మడి రాష్ట్రంలో చీకటి దశాబ్దం
* రైతులు,మహిళలు,యువత దుస్థితి
* పాదయాత్రలో ప్రజల కష్టాలు, చలించిపోయాను.
* అప్పట్లో రోజుకు కరెంట్ అర్ధరాత్రి పూట మూడున్నర గంటలు
* పాముకాట్లకు 4వేలమంది, కరెంట్ షాక్ లకు 4వేల మంది బలి
* 24వేల మంది రైతుల ఆత్మహత్యలు
* రోజుకు 48మంది,ప్రతి అరగంటకు ఒక రైతు పిట్టల్లా రాలిపోయారు
* పాదయాత్రలో రైతులకు రుణమాఫీ ప్రకటించాను
* వ్యవసాయాన్ని లాభసాటి చేస్తానని చెప్పాను
* గత 5ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు
* రూ.24,500కోట్ల రైతురుణ ఉపశమనం ఒక చరిత్ర
* 55లక్షల మందికి రైతు కుటుంబాలకు లబ్ది
* ‘‘అన్నదాత సుఖీభవ’’ పథకం తెచ్చాం
* దాదాపు 60లక్షల రైతు కుటుంబాలకు లబ్ది
* బిజెపిలో రైతు ఆదాయాలు రెట్టింపు అన్నారు ఘోరంగా విఫలం
* తమిళనాడు,మహారాష్ట్ర,ఢిల్లీలో రైతుల మార్చ్ లు, మధ్యప్రదేశ్ లో పోలీసు కాల్పుల్లో 5గురు రైతుల బలి.
* కోటి మంది చెల్లెళ్లకు ‘‘పసుపు-కుంకుమ
* ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.20వేలు-రూ.21వేల కోట్లు
* ‘పసుపు-కుంకుమ’కు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ
* 5ఏళ్లలో రూ.లక్ష కోట్ల సంక్షేమం.
* యువత ఉద్యోగాల కల్పన
* పెట్టుబడులు రాబట్టాం. ఉద్యోగాలు కల్పించాం
* వరుసగా 3సమ్మిట్ లు-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ 1
* గత 5ఏళ్లలో 9లక్షల ఉద్యోగాలు
* రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు, 30లక్షల ఉద్యోగాల కల్పన
* ఎంవోయూలు. ఐటి రంగంలో 2లక్షల ఉద్యోగాలు,ఎలక్ట్రానిక్స్ రంగంలో 3లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టాం
* లక్ష ఉద్యోగాల పైగా తెచ్చాం.
* మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్
* 5ఏళ్లలో ఏపిలో 36లక్షల ఫోన్లు తయారు
* దేశంలో తయారయ్యే ప్రతి 5ఫోన్లలో 1 ఏపిలోనే.
* యువత నైపుణ్యాభివృద్ధి
* ఉపాధి వచ్చేదాకా ప్రతినెలా భృతి రూ.1,000-దానిని రూ.2వేలకు పెంచా
* బీసీలకు రూ.43వేల కోట్లు, ఎస్సీలకు రూ.40వేల కోట్లు, ఎస్టీలకు రూ.14వేల కోట్లు
* ముస్లిం మైనారిటిలకు రూ.4వేల కోట్లు బడ్జెట్.
* బీసి భవన్ ల నిర్మాణం, బీసిలకు ప్రత్యేక బడ్జెట్, బిసి విద్యార్ధుల విదేశీవిద్య,స్కాలర్ షిప్ లు, ఫీజులు, ఆదరణ -2 కింద 8లక్షల కుటుంబాలకు అండగా ఉన్నాం
* ఎస్సీలకు,ఎస్టీలకు జగజ్జీవన్ జ్యోతి, 100యూనిట్ల ఉచిత విద్యుత్
* విదేశీవిద్యకు రూ.10లక్షలు
* కార్పోరేషన్ బడ్జెట్ 4రెట్లు పెంచాం.
* ముస్లింల బడ్జెట్ 4రెట్లు
* ఇమామ్ లు, మౌజన్ లకు వేతనాలు
* దుల్హన్ కింద రూ.50వేలు
* స్వయం ఉపాధికి ప్రోత్సాహం
* 10లక్షల పంటకుంటలు
* ఎల్ ఈడి బల్బులు,జగజ్జీవన్ జ్యోతి, రైతు రథాలు (ట్రాక్టర్లు),అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ
* రూ.10కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ, జీవిత కాల పన్ను తొలగింపు
* అంగన్ వాడి, ఆశా వర్కర్లు, హోంగార్డులు, చిరుద్యోగుల వేతనాల పెంపు.
* 5ఏళ్లలో ఇన్ని చేసిన పార్టీ దేశచరిత్రలో లేదు
* మేనిఫెస్టో హామీలు 100% నెరవేర్చిన ఘనత టిడిపిదే
* ప్రజాదరణ, రెట్టించిన స్ఫూర్తితో 2019ఎన్నికల మేనిఫెస్టో తయారీ
* ఇందులో మరిన్నో వినూత్న పథకాలు.
* గత ఎన్నికల్లో ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కంటె రెట్టింపు విశ్వాసం,నమ్మకం తెలుగుదేశం పార్టీ పట్ల…
* టిడిపి మిషన్ 150ప్లస్ మా టార్గెట్-25ఎంపీ సీట్లు
* 150పైగా అసెంబ్లీ సీట్లలో ఘన విజయం తథ్యం
* 2019 మేనిఫెస్టో 100% అమలు చేస్తాం
* చెప్పనివి కూడా రెట్టింపు చేస్తాం(అంటే సెంచరీ, 100కు పైగా)
* ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో అన్ని అంశాలను అమలు చేయిస్తాం
* మోది, షాల బిజెపికి బుద్ది చెబుతాం.కేంద్రంలో రాబోయేది కొత్త ప్రధానే
* ఏపి ప్రయోజనాలు కాపాడతాం
* 5కోట్ల ప్రజల హక్కులు సాధిస్తాం.