DailyDose

సిఐపై ఈసీ వేటు-తాజావార్తలు–04/07

madanapalle ci suspended

* నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. మదనపల్లె టూ టౌన్‌ సీఐ సురేష్‌ కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 2వ తేదీన మదనపల్లెలో సీఎం పర్యటన సందర్భంగా స్థానిక నిమ్మనపల్లె మార్గం లో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు ఆహార పొట్లాలు ప్యాక్‌చేసి అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది.ఈ విషయాన్ని రాజంపేట పార్లమెంట్‌ అబ్జర్వర్‌ నవీన్‌కుమార్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారాన్ని చేరవేశారు. ఆర్‌ఐ పల్లవి సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం వాస్తవమని ధ్రువీకరించి కేసు నమోదుకు సీఐ సురేష్‌ కుమార్‌కు సిఫారసు చేశారు. కేసు నమోదులో సీఐ అలసత్వం కనబరిచినందుకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. సురేష్‌ స్థానంలో అనంతపురం డీటీసీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సుబ్బరాయుడును నియమించారు
*అసాధారణ ఇన్నింగ్స్ తో ఆండ్రీ రసెల్ బెంగళూరు నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు. అతడి నైపుణ్యాన్ని అరాదిస్తున్నా బెంగళూరును చూసు జలిపడుతున్నా భారీ స్కోరు చేసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు కోహ్లీ బ్యాటింగు లో మాస్టర్ అందులో ఎలాంటి సందేహం లేదు. ఐతే కెప్టెన్సీ అతడు ఇంకా అప్రేంటీస్ ఇంకా చాలా నేర్చుకోవాలి బౌలర్లను నిదించడం కంటే అతడు తనను తానూ నిందించుకోవాలి.
*బాహుబలి సినిమాలో అసద్యాన్ని సుసాధ్యం చేస్తుంటాడు కధానాయకుడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా ఈ ఐపీఎల్ లో అలాగే చేస్తున్నారు. కల్ కతా విజయవకశాలే లేవనుకున్న దశలో వచ్చి విద్వంసక ఇన్నింగ్స్ అడేస్తున్నాడుతన జట్టుకు అసాధారణ విజయాలందిస్తూన్నాడు.
* ఈవీఎం.. ఓటు వేసేందుకు వినియోగించే యంత్రం. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైతే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మరి.. అంతసేపు ఈవీఎం కరెంటు లేకుండా ఎలా పనిచేస్తుందో తెలుసా..! అందులో నిరంతరాయంగా 12 గంటల పాటు వచ్చే బ్యాటరీలు వినియోగిస్తున్నారు. వీటికి మధ్యలో ఛార్జింగ్‌ పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఈ నెల 11న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కోసం ఈవీఎంలను ఎన్నికల అధికారులు వినియోగిస్తున్నారు. వీటిని ఎక్కడికక్కడ తనిఖీ చేసిన అనంతరం బ్యాలెట్‌ పేపర్లు అమరుస్తున్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఈవీఎంలను సిబ్బంది తీసుకునే సమయంలోనే కొత్త బ్యాటరీలను వాటికి అమర్చి ఇస్తారు.
*రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడవచ్చని పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వివరించింది.
*పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ ల్యాడ్స్‌) కింద తెలంగాణ ఎంపీలు పనులను బాగానే సిఫార్సు చేసినప్పటికీ.. కేంద్రం మాత్రం పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదు. రాష్ట్రంలోని మొత్తం 17 మంది లోక్‌సభ సభ్యులకు అయిదేళ్లలో రూ.425 కోట్లు కేంద్రం నుంచి రావాల్సిఉండగా.. అందులో రూ.285 కోట్లు (67 శాతం) మాత్రమే మంజూరయ్యాయి.
*దక్షిణ మధ్య రైల్వే పరిధిలో డీజిల్‌ ఇంజిన్లను మరో రెండేళ్లలో పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జోన్‌ పరిధిలో 55 శాతం నెట్‌వర్క్‌లో విద్యుదీకరణ పూర్తయింది. మిగిలిన మార్గంలో డీజిల్‌ ఇంజిన్లతో రైళ్లు నడుస్తున్నాయి.
*సివిల్స్‌లో తెలంగాణ నుంచి బీసీలు అతి తక్కువ సంఖ్యలో ఎంపికయ్యారని, గత పదేళ్లుగా బీసీ స్టడీ సర్కిల్‌ నుంచి ఒక్కరూ కూడా ఎంపిక కావడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌, దిల్లీలోని ప్రైవేట్‌ స్టడీ సర్కిళ్ల నుంచి 2 వేల మందిని ఎంపిక చేసి ప్రభుత్వమే పూర్తి ఫీజులు భరించి శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో సివిల్స్‌కు 759 మంది ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుంచి 44 మంది ఎంపిక కావడం సంతోషకరమన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సీఎస్‌ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల నడుమ ఆయన విధులను స్వీకరించారు.
*ఏపీలోని 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు రూ.1980 కోట్లు నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఒక్కో మహిళలకు రూ.10 వేల చొప్పున మూడు విడతల్లో అందించనున్నట్లు ప్రభుత్వం జనవరిలో ప్రకటించింది.
*చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సురేష్‌కుమార్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. రాజంపేట అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు జీఎస్‌ నవీన్‌కుమార్‌ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చర్యలు తీసుకున్నారు.
*ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తాము అధికారంలో వస్తే పౌర ప్రజాస్వామిక హక్కులు, జైళ్లలో ఉన్న మేధావుల విడుదల అంశాలపై ఎన్నికల ప్రణాళికల్లో నిర్దిష్ట హామీ ఇవ్వాలని విప్లవ రచయితల సంఘం (విరసం) డిమాండ్‌ చేసింది.
*ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతి బా పూలే జయంతి ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సంఘం ఇతర నాయకులతో కలిసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని, ఎన్నికల కారణంగా జరపకపోవడం సరికాదని అన్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెదేపా అభ్యర్థులపై సాక్షి పత్రిక, ఛానల్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదికి తెదేపా ఫిర్యాదు చేసింది. తెదేపా నేతల ప్రతిష్ఠను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. దీనిపై లోగడే ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వివరించింది. శనివారం సచివాలయంలో తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ద్వివేదిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు.