Politics

అచ్చెన్నకు పిచ్చెక్కిస్తున్నారు

tough fight in tekkali for atchannaidu

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత స్థానం టెక్కలి.. 1994లో ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బ్లూగ్రానైట్‌’కు ఈ ప్రాంతం ప్రసిద్ధి. రాష్ట్రంలోనేఅత్యధికంగా ఉప్పు పండించే నౌపడ ఉప్పుగల్లీ, భావనపాడు తీరం ఇక్కడివే. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై విజయం సాధించి.. చంద్రబాబు మంత్రివర్గంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అచ్చెన్నాయుడు మరోసారి బరిలో ఉన్నారు. వైకాపా నుంచి పేరాడ తిలక్‌ పోటీ చేస్తున్నారు.
**అచ్చెన్న అభివృద్ధి మంత్రం
ఈ అయిదేళ్లలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. 16 ఎత్తిపోతల పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీటిని అందించే ప్రయత్నం చేశారు.విపక్షానికి పట్టున్న ప్రాంతాల్లోనూ పనులు చేశారు.టెక్కలిలో అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా ఆస్పత్రిని ప్రారంభించారు.నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధం ఉంది. స్వపక్షం, విపక్షం తేడా లేకుండా అందరికీ పనులు చేస్తారు.అట్టడుగు స్థాయి వర్గాల్లో ఆయన సోదరుడు కింజరాపు ప్రసాద్‌కు పట్టుంది.ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ పట్ల యువతలో ప్రత్యేక అభిమానం ఉంది.ఆరోపణలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం.జన్మభూమి కమిటీ సభ్యుల ఏకపక్ష వైఖరిపై విమర్శలు.
*పేరాడ తిలక్‌..
2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిత్వానికి పోటీ పడిన తిలక్‌.. 2016లో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా ఎంపికయ్యారు. బలమైన సామాజిక వర్గం; ఓటర్లలో జగన్‌ అభిమానులు; పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పని చేయడం ఆయనకు సానుకూల అంశాలు.సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో తిలక్‌కు అంతగా పరిచయాలు లేవు.కొండల ప్రాంతంలో ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించి రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.భాజపా, జనసేన అభ్యర్థులు తిలక్‌ సామాజిక వర్గ ఓట్లను చీల్చే అవకాశం.
**ఇదీ చరిత్ర
దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు ప్రాతినిధ్యం వహించిన హరిశ్చంద్రాపురం పునర్విభజన తరువాత టెక్కలి నియోజకవర్గంగా ఏర్పడింది. 1996లో ఎర్రన్నాయుడు ఎంపీగా గెలుపొంది.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో హరిశ్చంద్రాపురం శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. నాడు తొలిసారి అచ్చెన్నాయుడు పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. 2009లో టెక్కలి నియోజకవర్గం ఏర్పాటయ్యాక.. జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తరవాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ మరోసారి ఓటమి చవి చూశారు.