DailyDose

146 కేజీలు బంగారం పట్టుబడింది-నేరవార్తలు–04/08

coimbatore gold seized

*తమిళనాడులో జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలో పులియాకులం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంది. ఎ బంగారాన్ని ఓ వ్యాన్ లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు తెలిసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బంగారానికి సంబందించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
*వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరో పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. తొలుత విధించిన కస్టడి ముగిసి అనంతరం నిందితులను సోమవారం పోలేసులు కోర్టులో హాజరు పరిచారు,. వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పీఎ కృష్ణారెడ్డి వంట మనిషి కుమారుడు ప్రకాష్ తొలుత పంనేడు రోజుల రిమాండు విధించిన సంగతి తెలిసిందే ఆ గడువు సోమవారంతో పూర్తీ కాగా మరో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ న్యాయనం పొడిగించింది.
*దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ ఎల్ రీసా తునిసేస్ ఫౌరీ రోడ్డు ప్రమదంలో మృతి చెందారు. తన బిడ్డతో కలిసి సౌతాఫ్రికా మైనింగ్ సిటి స్టీల్ పౌంతైన్ మార్గం గుండా కారులో ప్రయానిస్తున్నారామే అయితే దురదృష్టవశాత్తూ ఆ కారు ప్రమాదానికి గురైంది. దీంతో బిడ్డతో సహా తునీ స్సేస్ పౌరీ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పై స్పందించిన క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎక్జిక్యూటివ్ ఎల్ రీసా కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపారు. మాటలకందని విషాదం ఇది.
*చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం రూ.కోటి విలువ చేసే కూపన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
*చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్‌ పురం గ్రామానికి చెందిన వైకాపా నాయకుడి ఇంట్లో పోలీసులు భారీగా మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
*ఎన్నికల నేపథ్యంలో విశాఖ నగరంలోని పలు ప్రాంతాలలో ఓటర్లకి డబ్బులు పంపిణీ చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మానగర్‌లో డి.వెంకటపతిరాజుని అరెస్టు చేసి రూ.37 వేలు, బర్మాక్యాంపు ప్రాంతంలో జాన్‌ జోసెఫ్‌నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు.
*చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం కొత్తూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న తెదేపా శ్రేణులపై వైకాపాకు చెందిన అల్లరిమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆదివారం రాత్రి కొత్తూరులో వైకాపా చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
*విద్యుత్తు తీగలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. తన పొలంలో వేలాడుతున్న తీగలను తొలగించాలంటూ రెండేళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడమే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
*ఓటర్లను ప్రలోభపెట్టేందుకు హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు భారీగా నగదు తరలుతుందన్న సమాచారంతో హైదరాబాద్‌ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి రూ.4.93 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు.
*మధ్యప్రదేశ్‌ రాష్ట్రం హోషంగాబాద్‌ జిల్లాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఎకరాల్లో పంటలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 25 మంది గాయపడ్డారు. మృతులను స్థానిక పంజ్రా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
*మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ అనుచరుడు, ఓఎస్‌డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. దిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇండోర్‌లోని ప్రవీణ్‌ నివాసంలో ఆదివారం ఉదయం సోదాలు చేశారు.
*జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సెలవులో ఉన్న ఓ జవాన్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. కశ్మీర్‌ ప్రాంతంలోని సైనికుడి స్వగ్రామమైన వార్‌పొరలో ఈ ఘటన చోటు చేసుకుంది.
*కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇవాళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిజాంపేట్‌ నుంచి మల్కాజ్‌గిరికి తరలిస్తున్న రూ. లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తులదిగా పోలీసులు గుర్తించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ఈ నెల వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు మేన వెలువడనున్నాయి.
* గోవిందరాజస్వామి కిరీటాల దొంగ అరెస్టు!
ఏపీలో గతంలో సంచలనం సృష్టించిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల చోరీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో కిరీటాలు దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉపాలయంలో రెండు నెలల క్రితం వజ్రాలు పొదిగిన మూడు కిరీటాలు చోరీకి గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తిరుపతి పోలీసులు, తితిదే నిఘా విభాగం అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా దేశంలోని పలు చోట్ల విచారణ జరిపారు. అయితే, ఆలయంలో కిరాటాలు చోరీకి గురైన రోజున ఆలయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలో ఓ వ్యక్తిని గుర్తించారు. దీని ఆధారంగా ఆ వ్యక్తికి సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.ఆ వ్యక్తికి సంబంధించి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించి మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వాడిగా గుర్తించారు. దొంగతనం జరిగినప్పటి నుంచి అతడి కదలికలపై నిఘా వుంచారు. నిందితుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నట్టు గుర్తించి దాదర్‌ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తిరుపతికి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో విచారించనున్నారు. స్థానికుల సహకారంతో దొంగిలించాడా? ఎలా చేశాడనేది విచారణలో తేలనుంది. అతడే దొంగతనం చేసినట్టు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. చోరీకి గురైన కిరీటాలు మాత్రం ఇప్పటివరకు తితిదే అధికారులకు గానీ, పోలీసులకు గానీ లభ్యం కాలేదు. వీటిని ఎత్తుకెళ్లినట్టు గుర్తించిన ఆ వ్యక్తిని విచారించడం ద్వారా వాటిని ఎక్కడైనా దాచాడా? లేదా ఎవరికైనా విక్రయించాడా అనే విషమం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.