Sports

కోహ్లీ ఎప్పటికీ అప్రెంటిస్సే!

gambhir criticizes kohli

భారత జట్టు మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మరోసారి విరాట్‌ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు క్రీడలు.. ఇలా ఏ రంగమైనా.. తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటాడు గంభీర్‌. గతంలో ధోనిపై వరుస విమర్శలు చేసిన గంభీర్‌.. ఇప్పుడు కోహ్లీని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘కోహ్లీ.. ఆర్సీబీ ఇన్నేళ్లు నిన్ను కెప్టెన్‌గా భరించింది. అది చాలా గొప్పవిషయం. కానీ నువ్వు ఇంతవరకూ ఒక్క ట్రోఫీ కూడా గెలిపించలేకపోయావు’ అని అన్నాడు. ‘కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ కావచ్చు.. కానీ అత్యుత్తమ కెప్టెన్‌ మాత్రం కాదు. కెప్టెన్సీలో కోహ్లీ ఎప్పటికీ అప్రెంటీసే’ అంటూ ఘాటు విమర్శలు చేశాడు. అయితే గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన కోహ్లీ.. ‘బయట వాళ్లలా నేను ఆలోచిస్తే.. నేను కూడా ఇంట్లోనే కూర్చునేవాడిని’ అంటూ జావాబు ఇచ్చాడు. అంతటితో ఆగని గంభీర్‌.. గంటల వ్యవధిలోనే కోహ్లీని మరోసారి విమర్శించాడు. జట్టు ఓటమికి బౌలర్లపై నిందలు వేయవద్దని కోహ్లీకి సూచించాడు. భారత జట్టు కెప్టెన్‌గా ఉండి ఐపీఎల్‌ గెలవని కెప్టెన్‌ కోహ్లీ మాత్రమే అని గంభీర్‌ పేర్కొన్నాడు. ధోనితో కోహ్లీని పోల్చడం సరికాదన్నాడు. భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌శర్మ కూడా తన జట్టును రెండు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలబెట్టాడని గుర్తు పెట్టుకోవాలన్నాడు. ‘నా వ్యాఖ్యాలపై క్రికెట్‌ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో నాకు తెలుసు.. కానీ జట్టు విజేతగా నిలవడమే నాకు ముఖ్యం అని పేర్కొన్నాడు. కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన విషయం తెలిసిందే.