Health

అతి బరువుతో మూత్రపిండాలకు చేటు

obesity damages kidneys

ఊబకాయం కిడ్నీ ఆర్యోగాన్ని దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నచిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. బీపీ, షుగర్‌ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరగడం వల్ల కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కనిగిరి, వింజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, కొండాపురం, పొదలకూరు, వెంకటగిరి, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో ఫ్లోరైడ్‌ నీరు లభ్యతతో ఆ నీటిని తాగినవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నందున ఇతర చుట్టు పక్కల జిల్లాల కంటే జిల్లాలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– షుగర్‌ (డయాబెటీస్‌) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం.
– మూత్రంలో ప్రొటీన్‌ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది.
– ఫ్లోరైడ్‌ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడతారు.
– నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.
– వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
– కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం, రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
– షుగర (డయాబెటీస్‌) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
– వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి.
– ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి.
– అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి.
– పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్‌ వెజిటేరియన్‌ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది.