Movies

డాన్ కోసం

katrina to star in don3

‘డాన్‌’ చిత్రాల సిరీస్‌లో ఫరాన్‌ అక్తర్‌ ‘డాన్‌ 3’ని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘డాన్‌’, ‘డాన్‌ 2’ మంచి విజయం సాధించాయి. మూడో చిత్రంలో కథానాయికగా కత్రినాకైఫ్‌ పేరు వినిపించింది. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొణెను దాదాపు ఖాయం చేసినట్టే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. దీపిక ప్రస్తుతం ‘చపాక్‌’ చిత్రీకరణలో బిజీగా ఉంది.డాన్‌నే మారుస్తారా? కథానాయికగా దీపిక పేరు వినిపించడమే కాదు, ఏకంగా డాన్‌ స్థానంలో షారుఖ్‌ బదులు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తారనే పుకార్లు వస్తున్నాయి. వరుస పరాజయాల్లో ఉన్న షారుఖ్‌ ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో బలమైన కథ కోసం చూస్తున్నారట. అందుకే రాకేష్‌శర్మ బయోపిక్‌తో పాటు ‘డాన్‌ 3’ని కూడా వదులుకున్నారని వినిపిస్తోంది. అదే నిజమైతే పెళ్లి తర్వాత రణ్‌వీర్‌- దీపిక కలసి నటిస్తున్న చిత్రం ‘డాన్‌ 3’నే అవుతుంది.