Movies

అభినేత్రి-2

abhinetri 2 is coming

ప్రభుదేవా, తమన్నా జంటగా, విజయ్‌ దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం ‘దేవి’. తెలుగులో ‘అభినేత్రి’ పేరుతో విడుదలైన ఈ హారర్‌ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద నవ్వులు పంచింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘అభినేత్రి-2’ పేరుతో మరో చిత్రం రాబోతోంది. నటిగా రాణించలేకపోయి, ఆత్మహత్య చేసుకున్న రూబీ అనే యువతి తమన్నా శరీరంలోకి ప్రవేశించి, ప్రభుదేవాను ముప్పుతిప్పలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో చివరికి తమన్నా శరీరాన్ని విడిచి వెళ్లిపోతుంది. అయితే, మళ్లీ రూబీ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? తెలియాలంటే ‘అభినేత్రి2’ చూడాల్సిందే. తమిళంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.